టెక్నాలజీ ఆధారిత తెలంగాణ. – కేటీఆర్.

హైదరాబాద్:
టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థం అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందన్నారు.ఆ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టిపెట్టామన్నారు. ఐటీ ఆధారిత సేవలను రోజు రోజుకూ బలపరుస్తూనే ఉన్నామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమైందన్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ ఇలా ఎన్నో సాంకేతిక విప్లవాలు వస్తున్నాయన్నారు.