ట్రాఫిక్ సిగ్నల్ పై నవదీప్ సెటైర్లు.

హైదరాబాద్:
ట్రాఫిక్ సిగ్నల్‌పై సెటైర్ వేశాడు యంగ్ హీరో నవదీప్. ట్రాఫిక్ సిగ్నల్ పిక్‌ని పోస్ట్ చేసిన నవదీప్ ‘జీవితంలో ఎలాంటి డైరెక్షన్ లేకుండా.. నన్ను అవమానించడం మానండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి ఓ ట్రాఫిక్ సిగ్నల్ పిక్‌ని జత చేశాడు. ఆ ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దీంతోపాటు లెఫ్ట్, స్ట్రెయిట్ డైరెక్షన్స్ సూచిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. ‘భయానకం’గా ఉంది అని ఒకరు.. ‘ఏ ఏరియా’ అని ఒకరు.. ’గుడ్ వన్’ అని ఒకరు.. ‘అన్నా ఒకసారి ఆగి… లెఫ్ట్‌కి వెళ్లి.. అప్పుడు రైట్‌కి వెళ్లు’ అని మరొకరు సూచిస్తూ సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు.