డయాలసిస్ సెంటర్ ప్రారంభం.

జగిత్యాల:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో డయలసిస్ సెంటర్ ను ఎంపీ కవిత ఆదివారం ప్రారంభించారు.
కిడ్నీ వ్యాధి భాదితులకు వైద్యం అందించడానికి జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో డయలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిని మూడు వందల పడకలకు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఐదు మల్టి స్పెషల్ ఆసుప్రతి లో అందించే అధునాత వైద్యాన్ని ఇ క్కడ కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రత్యేక ప్రసూతి నిలయాన్ని నిర్మoస్తామని తెలిపారు. అందు కొరకు ఇప్పటికే ఐదు ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజల ఆరోగ్య విషయంలో పట్టుదల తో అన్ని సదుపాయాలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.ఎల్ .ఏ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. శరత్ ,జెడ్. పి ఛైర్మెన్ తులా ఉమా , ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ రాజేశం,మున్సిపల్ ఛైర్మెన్ విజయలక్ష్మి , నియోజకవర్గ తెరాస ఇంచార్జ్ డా. సంజయ్ కమార్, వైద్య అధికారులు పాల్గొన్నారు.