డి.ఎస్.కుమారుడు సంజయ్ పై నిర్భయ కేసు.

హైదరాబాద్:
సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ తనయుడు సంజయ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్‌ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్‌ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు