డీకే సమరసింహారెడ్డి కి కాంగ్రెస్‌ గ్రీన్ సిగ్నల్.

హైదరాబాద్:
గాంధీభవన్‌లో కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నలిచ్చారు. మహబూబ్‌నగర్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. డీకే సమరసింహారెడ్డి పార్టీలో చేరితే మీకు ఏమైనా అభ్యంతరమా అని డీకే అరుణను జానా ప్రశ్నించారు. తనకేం అభ్యంతరం లేదని ఆమె చెప్పారు.