డీజీపీ మహేందర్ రెడ్డి పై విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి.

కేసీఆర్ తో డిజిపి 100 కోట్ల డీల్.

 

హైదరాబాద్:

తనను కొడంగల్ లో ఓడించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వందకోట్ల రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ రద్దు అనంతరం నియోజకవర్గనికి తొలి సారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చినందుకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి మహేందర్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఏవిదంగా అయిన ఎన్నికల్లో తన అడ్డు తొలగించేదుకై కుట్రలు పన్నారు అన్నాడు. అందులో బాగంగా ఇద్దరు sp లు, యాబై మంది ఇనలిజెన్సీ పోలీసు బలగాలతో రాబోయే ఎన్నికలలో కొడంగల్ లో తనపై దాడి చేసేందుకు వంద కోట్ల రహస్య ఒప్పందం డీజీపీ కుదుర్చుకున్నాడని పక్క ప్రణాళిక రచించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో తాను ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ కి వంద సీట్లు రావడం ఖాయమని కేసీఆర్ సొంత సంస్థల సర్వేలు ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడం తో తనను ఎలాగైనా నాలుగు నెలలు జైల్లో నిర్బందించాలని కుట్రపన్నినట్టు చెప్పారు. కేసీఆర్ ప్రయివేట్ సైనికునిల వ్యవహరిస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి లేఖ రాయడం కుట్రలో భాగమేనని రేవంత్ ఆరోపించాడు.

తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసనని అన్నారు.సోనియని రాహుల్ ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కల్వకుంట్ల కుటుంబం మొత్తం సోనియా ముందు ఎందుకు మొకరిల్లారో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ తెలియజేలన్నారు. తెలంగాణ అభివృద్ధి కై ప్రాజెక్టులు కట్టింది పతకాలు ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ నని పేర్కొన్నారు. రాష్ట్రంలో kd కేసీఆర్ కేంద్రంలో మోడీ అంతం కాంగ్రెస్ పంతామని రేవంత్ అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఏ విదంగా అయిన నన్ను ఓడించేందుకు వందకోట్ల మూట ముఠా లతో సీఎం కేసీఆర్ పట్నం సోదరుల ముఠాలతో కొడంగల్ పై దాడికి పాల్పడబోతున్నడని ఆరోపించారు. రాష్ట్రంలోనే ఈ ఎన్నిక కొడంగల్ ప్రజల పౌరుషానికిగజ్వేల్ గడి దొర పెత్తందారీ తననికి జరిగే ఎన్నికని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెమట రక్తం చిందించి అయిన సరే తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే పది ఏళ్ల వరకు పట్నం కుటుంబ పాలనను రాజకీయంగా బొంద పెడతానని శపతం చేశారు.