ఢిల్లీకి గద్దర్. రాహుల్ తో భేటీ !!


ఎస్.కె. జకీర్.

ప్రజాయుద్ధ నౌక, ప్రజాగాయకుడు గద్దర్ గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేయాలని గద్దర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాంఛనంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా ? లేక ‘కూటమి’ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రణాళిక సిద్దమైందా ? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ‘ కూటమి’ మద్దతు తీసుకోనున్నారా ? వంటి అంశాలపై శుక్రవారమే స్పష్టత రానున్నది. మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ , ఆది శ్రీనివాస్‌తో పాటూ మరికొంతమంది గత ఏప్రిల్ లో కాంగ్రెస్ లో చేరారు. సూర్యకిరణ్ పెద్దపల్లి లోక్ సభ నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది.