తమ్మిడిహట్టి దగ్గరే ప్రాణహిత ప్రాజెక్టు. – పాల్వాయి హరీశ్ డిమాండ్.

ఆదిలాబాద్:
తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టును కచ్చితంగా ఇక్కడ నిర్మించే వరకు పోరాడతానని, సిర్పూర్ నియోజక వర్గంలోని చుట్టు పక్కల గ్రామాలకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చి తీర్చాల్సిందేనని పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో ప్రతి గ్రామానికి తాగునీరందించడం అటుంచితే భగీరథ కోసం రోడ్లను తవ్వడంతో రోడ్డు నడువలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. శనివారం కౌటాలహెట్టి గ్రామాన్ని సందర్శించిన పాల్వాయి హరీష్‌రావు మాట్లాడారు. సిర్పూర్ నియోజక వర్గంలో అనేక గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్నాయన్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే నియోజక వర్గంలోని కొండపల్లి, అగర్‌గూడ, బారేగూడ, చింతకుంట, మెరగూడ తదితర గ్రామాల్లోని రోడ్లు బుదరమయంగా మారి ప్రజలు ఇబ్బందిపడ్డారని, మంత్రులు, ఎమ్మెల్యే మాత్రం నియోజక వర్గంలో 90శాతం రోడ్లు పూర్తయ్యాయని, ఇంకా 10శాతం మాత్రమే పూర్తి కావాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మె ల్యే దత్తత గ్రామమైన హెట్టి గ్రామంలోనే ఏమేరకు అభివృద్ధ్ది జరిగిందో గ్రామాన్ని చూస్తేనే అర్థమవుతుందని,ఎంత అభివృద్ది చేశారో ఎమ్మెల్యే ప్రజలకు వివరిం చాలన్నారు. హెట్టి గ్రామం పక్క నుంచి పోతున్న ప్రాణహిత నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టు కాళేశ్వరానికి తరలించినా కనీసం ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని ఆయన దుయ్యబట్టారు. రాజకీయం అంటే మాట ఇవ్వడం కాదని, పనులు చేసి గ్రామాలను అభివృద్ది చేయాలని అప్పుడే మనకు ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కౌటాల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని పాల్వాయి హరీష్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులు గత 13 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. జీపీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట కౌటాల మండల నాయకులు ఎల్మూలే మల్లయ్య, కలీంషాషా, దుర్గం మోతీరాం, బోరుకుటి విఠల్, రాజేందర్‌గౌడ్, తదితరులు ఉన్నారు.