‘తాకట్టులో తెలంగాణ’. ఇరిగేషన్ పై బహిరంగ చర్చకు రావాలి. మంత్రి హరీశ్ కు రేవంత్ సవాలు.

హైదరాబాద్:
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భావితరాలను బ్యాంకులకు తాకట్టు పెట్టిందని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు.నీళ్ల ను అడ్డు పెట్టుకొని
ప్రభుత్వం వేల కోట్లు దోచుకుంటున్నట్లు ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.11వేల కోట్లు ‘ప్రాణహిత’ కు నాటి కాంగ్రెస్ ఖర్చు చేసిందన్నారు.కాళేశ్వరం
ప్రాజెక్టుడిజైన్ మార్చి 84వేల కోట్లకు ఈ ప్రభుత్వం పెంచింది వాస్తవం కాదా ..? అని ప్రశ్నించారు.సమాధానం చెప్పకుండా మంత్రి హరీష్ ఎదురుదాడి చేశారని అన్నారు.
నల్ల తాచు కంటే ఎక్కువ విషాన్ని హరీష్ కాంగ్రెస్ ,జేఏసీ లపై కక్కుతున్నారని రేవంత్ విమర్శించారు.ఏరోటికాడ ఆ పాట హరీష్ పాడుతున్నారని చెప్పారు.సూర్యాపేట ,పెద్దపల్లి ,కరీం నగర్ లో హరీష్ చెప్పిన మాటలు గుర్తుందా ..? అని అన్నారు.ఇంతకు ఎవరికి నీళ్ళు వస్తాయో హరీష్ చెప్పాలని ఆయన సవాలు చేశారు.’నీళ్ళ సెంటిమెంట్’ ను వాడుకోవాలని టీఆరెస్ చూస్తుందని అన్నారు.కేసీఆర్ కొత్తగా మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు హరీష్ చెప్పాలని రేవంత్ ఛాలెంజ్ చేశారు.
పాలమూర్ రంగారెడ్డి, నెట్టెం పాడు ,కల్వకుర్తి ప్రాణహిత ,నిజాం సాగర్ ఎక్కడికైనా చర్చకు రావాలని ఆయన మంత్రికి సవాలు విసిరారు.అల్లుడు ఆణిముత్యం,మామ స్వాతిముత్యం లా కేసీఆర్ ,హరీష్ లు పొగుడుకుంటున్నారని హేళన చేశారు.
3లక్షల ఎకరాల కోసం నిర్మించిన ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టు 17కీ.మీ టన్నెల్ ను కెసిఆర్ ప్రభుత్వం ఆపింది నిజం కాదా ..? అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ లు కమిషన్ ఇవ్వనందుకే కేసీఆర్ దాని పనులను ఆపారని అన్నారు.
ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రణాళికలో కానీ ఎక్కడ రీడిజైన్ ల గురించి టీఆరెస్ ప్రస్తావించలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకునేందుకే ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని,మిషన్ భగీరథను చేపట్టారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమపై దూషణలకు దిగుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
కొడుకు,అల్లుడికి కేసీఆర్ వాటాలు పంచుతున్నారని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి హరీష్ కు సవాలు చేశారు.
గన్ పార్క్ దగ్గరైనా ,ప్రెస్ క్లబ్ లోనైనా చర్చకు రావడానికి తాను రెడీ అని ప్రకటించారు.
తన వాదన తప్పైతే తాను ముక్కు నేలకు రాస్తా నని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టొద్దని నిపుణులు నివేదిక ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.కాళేశ్వరం ముసుగులో లబ్ది దారులు,సూత్రదారులు ,వాటాదారులు ఎవరు ..? అని ఆయన ప్రశ్నలు సంధించారు.కాళేశ్వరం పుర్తయితే బ్యాంక్ లోన్ ల కారణంగా ఎకరాకు ఒక లక్ష 54వేలు ఖర్చవుతుందని ఎమ్మెల్యే చెప్పారు.ఈ ప్రభుత్వం తీరుతో భారం ఎవరు భరించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు.దోపిడీకి తాము వ్యతిరేకం తప్ప ప్రాజెక్టులకు కాదని ఆయన ప్రకటించారు.కేసీఆర్ దోపిడీకి బరాబర్ తాము వ్యతిరేకమన్నారు.కెసిఆర్ నీళ్ల ముసుగులో చేస్తున్న దోపిడీకి తాము అడ్డం పడుతూన్నట్టు చెప్పారు.”కాళ్ల సందుల్లో కట్టెలు కాదు, మీ దోపిడీకి అడ్డంగా బరాబర్ గా నిలబడతాం.
ఇప్పుడు రాష్ట్రంలో 84వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.ప్రభుత్వం చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పును పంచితే ప్రజలకు ఒక్కొరికి లక్ష రూపాయలు ఇవ్వొచ్చు.ప్రాజెక్టు ల నిర్మాణం గురించి కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి హరీశ్ కు లేదు.కెసిఆర్ ప్రభుత్వం లో అందరు కేడీలే.
హరీష్ భూములకు ఇస్తున్న 12 లక్షలు రైతుల భూమికి ఎందుకు ఇవ్వరు?హరీష్ భూములు ఏమైనా బంగారమా? హరీష్ కు నీతి నిజాయితీ ఉంటె నీళ్ళు -నిజాలపై చర్చ కు రావాలి.” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.