తినే ఆహారంలో బొద్దింకలు,ఎలుకలు.

ఖమ్మం.
మొన్న ఒక హోటల్ లో చనిపోయిన ఎలుక, ఇప్పుడు బొద్దింకలు, పురుగులు… ఖమ్మం జిల్లాలో ఫుడ్ అధికారులు నిద్రపోతున్నందున హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నవి. నగరంలోని అతి పెద్ద ఫ్యామిలీ రెస్టారెంట్ హావేలి లోని పెరుగన్నంలో బొద్దింక వచ్చింది. దీనిపై మణుగూరు కు చెందిన రంగారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఫుడ్ అధికారులు పట్టించుకోలేదు. స్పందన పుడ్ ప్లాజ ఖమ్మం వైరా రోడ్డు పాత ఎల్.ఐ.సీ కాంప్లెక్సు దగ్గర ఉంది. వెజ్ బిర్యానీ లో పురుగులు వచ్చాయని పాండురంగపురం యువకులు ఫిర్యాదు చేశారు. బాధిత యువకులపైనే ప్లాజా సిబ్బంది దాడికి దిగడం కొసమెరుపు.