తిరుపతిలో సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు.

తిరుపతి:
తిరుపతిలోని తారకరామ స్టేడియంలో 36వ జాతీయ స్థాయి జూనియర్ బాల, బాలికల సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ , తుడా చైర్మన్ నరసింహయాదవ్ తదితరులు.జాతీయ స్థాయి క్రీడలకు తిరుపతి వేదిక కావడం సంతోషంగా ఉందని మంత్రి అమరనాథ రెడ్డి అన్నారు.మానసిక ఉల్లాసానికే కాదు లక్ష్యసాధనకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. ఓడినా, గెలిచినా స్పోర్టివ్ గా తీసుకొని ముందుకు వెళ్లాలి మంత్రి అన్నారు.రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.కళాశాలల్లో, ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందన్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగించాలని మంత్రి అమరనాథ రెడ్డి కోరారు.