తిరుమలలో భక్తుల రద్దీ.

తిరుమల:
తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ భక్తులకు టోకెన్లు జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే, సర్వ, దివ్య దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.72 కోట్ల ఆదాయం లభించింది.