తుస్సుమన్న ఫెడరల్ ఫ్రన్ట్. -భట్టి విక్రమార్క

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.

హైదరాబాద్:
నీతి ఆయోగ్ చివరి సమావేశంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రస్తావిస్తారని భావించామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన సోమవారం సి ఎల్పీ లో విలేకరులతో మాట్లాడారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎం చేశారని ప్రశ్నించారు. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఢీల్లి వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రాణహిత లాంటి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా అడగాల్సింది పోయి, కాళేశ్వరం ప్రాజెక్టు కు డబ్బులు అడగటం ఏంటని అన్నారు. జాతీయ హోదా ఇస్తే 50వేల కోట్ల సహాయం హక్కుగా అందేవని భట్టి తెలిపారు. విభజన చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించకుండా వాపసు వచ్చారని అన్నారు.వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసం ఢీల్లి వెళ్లిన కేసీఆర్ తెలంగాణ కొంప ముంచారని ఆరోపించారు.
ఫెడరల్ ప్రాంట్ పేరుతో నడిపిన డ్రామా తుస్సుమందని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ లకు దూరంగా కొత్త వేదిక అంటూనే కేజ్రీవాల్ ను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. జిఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయాన్ని కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావేశం పెడితే తెలంగాణ మంత్రి ఎందుకు పాల్గొనలేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, లక్ష్యాలను బీజేపీ నాయకత్వం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు.ప్రభుత్వ ఖజానాతోనే సమావేశానికి వెళ్ళావని గుర్తు చేశారు. బీజేపీ తో అంతర్లీనంగా కేసీఆర్ జట్టు కట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు.