‘తూర్పు’కు తిరిగి దండం పెట్టను.- ఎర్రబెల్లి.

వరంగల్:

వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వెళతానని జరుగుతున్న ప్రచారాన్ని ఎర్రబెల్లి దయాకర్ ఖండించారు.తొర్రూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.మరో ఐదేళ్ళు సేవ చేసి పాలకుర్తి ప్రజల ఋణం తీర్చుకుంటానన్నారు. ‘వరంగల్ తూర్పు’కు ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నారు.పాలకుర్తి టికెట్ ఆశించే హక్కు డాక్టర్ సుధాకర్ రావుకు ఉన్నా తనకు మద్దతు పలికారని కృతజ్ఞతలు తెలిపారు.పాలకుర్తి టికెట్ పై పూర్తి అర్హత సుధాకర్ రావుకు ఉన్నా తనకు మద్దతు తెలిపారు.కష్టకాలంలో తనను ఆదరించిన పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకోడంతో పాటు ఎన్నో ఏళ్ళుగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులకు మోక్షం ఇప్పుడిప్పుడే లభిస్తుందన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక అభివృద్ధి పనులను చేపడుతున్నానని చెప్పారు.

మరో ఆరునెలల్లోనే పాలకుర్తి అభివృద్ధిని ప్రజలు చూడబోతున్నారని తెలిపారు.గోదావరి జలాలు, దేవాదులు ఎస్సారెస్పీ ద్వారా అన్నీ చెరువులను నింపడం జరుగుతుందని వివరించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టానని, పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.