తృటిలో తప్పిన ప్రమాదం.

హైదరాబాద్:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్లైట్ కు కొద్దిలో ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారు జామున కువైట్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన జజీరా ఎయిర్ లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం రన్ వే పై దిగుతుండగా… కుడివైపు ఉన్న ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో అలర్టైన పైలట్ విమానాన్ని నిలిపి వేశారు. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం విమానాన్ని చెక్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.