తెరాస కార్యకర్తల బూత్ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ కవిత.

జగిత్యాల:
తెలంగాణ ప్రభుత్వo ఏర్పడ్డాక 24 గంటలు విద్యత్తు అందిస్తున్న ఏకైక సర్కార్ కెసిఆర్ ప్రభుత్వమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మండల స్థాయి ( బూత్ లెవెల్ )కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్యఅథితిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ప్రజా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెరాస ప్రభుత్వం అభివృద్ధి లో దూసుకుపోతుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పధకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లని ఆమె సూచించారు. ఉమ్మడి కరీంనగర్ లో ఉన్నప్పుడు జగిత్యాల అభివృద్ధి కి నోచుకోలేదన్నారు. జిల్లా గా జగిత్యాల ఏర్పడ్డగా పరిపాలన సౌలభ్యం తో పాటు అభివృద్ధి లో పరుగు పెడుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలకు మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఓ .డి.ఎఫ్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెరాస ఇన్చార్జ్ బసవరాజు సారయ్య, ఎం.ఎల్.సి భాను ప్రసాద్ రావు , దేశపతి శ్రీనివాస్ రావు, గట్టు రామచంద్ర రావు , జగిత్యాల తెరాస ఇంచార్జ్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.