‘తెలంగాణ’ ఇచ్చిందెవరో కేసీఆర్ చెప్పాలి. – ఉత్తమ్ డిమాండ్.

హైదరాబాద్:
తెలంగాణ ఇచ్చింది ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చెప్పాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తన కనుసన్నల్లో తెలంగాణ బిల్లు తయారయిందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదికి చెంచాగిరి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విభజన హామీలు ఎందుకు అమలు చేయించలేకపోయారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అందరూ సహకరించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
‘సేవాదల్ క్రాంతి దివస్’ సందర్బంగా గాంధీ భవన్ లో పార్టీ జెండాను పీసీసీ అదేక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఎగరవేశారు.
కార్యక్రమానికి జానా రెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు బుసురాజు, సలీం అహ్మద్ , సంపత్ కుమార్ హాజరయ్యారు. భారత దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ అని టిపిసిసి అధ్యక్షుడు గుర్తు చేశారు. అదే విదంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
ఈప్పుడు తెలంగాణ ప్రజలు క్విట్ trs లక్ష్యంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయని, Trs పాలనను రాష్ట్రం నుండి పారదోలాలని కోరారు.రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సందర్బంగా వికృత చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. OU కు రాహుల్ గాంధీ వస్తే ఇబ్బంది అవుతుందని కొందరు విద్యార్థులతో
trs నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.