తెలంగాణకు 4 జాతీయ అవార్డులు.

న్యూఢిల్లీ:

తెలంగాణ జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీ లోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్చతా దివస్ కార్యక్రమం జరిగింది.

4 వ స్వచ్చ్ భారత్ మిషన్ లో భాగంగా అవార్డు ల ప్రదానోత్సవం జరిగింది.స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 లో భాగంగా రాష్ట్ర, జిల్లాల వారిగా అవార్డుల ప్రదానం చేశారు.అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలు, జిల్లాలు, సాప్ అవార్డ్స్, స్వచ్చతా పక్వాడ, స్వచ్చ్ ఐకానిక్ ప్లేసేస్ విభాగాల్లో అవార్డుల ప్రదానం చేశారు.

తెలంగాణ కు 4 అవార్డులు లభించాయి.

కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అవార్డు గ్రహీతలు.దక్షిణాది‌లో స్వచ్చతా ర్యాంక్స్ లో 81.48 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం, స్టేట్ లెవల్ అవార్డు అందుకున్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ (SSBMG ప్రాజెక్ట్ డైరెక్టర్) నీతూ కుమారీ ప్రసాద్.స్వచ్చతాలో దేశంలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పెద్దపల్లి నిలిచింది.
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన అందుకున్నారు.

దక్షిణాది జిల్లాల స్వచ్చ్ తా లో 95.59 పాయింట్లతో మూడో స్థానంలో వరంగల్ నిలిచింది. ప్రస్తుత జిహెచ్ఎంసి, అదనపు కమీషనర్ ఆమ్రపాలి ఈ అవార్డు అందుకున్నారు.స్వచ్చ్ తా ఐకాన్ విభాగం లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన *చార్మినార్*,అవార్డును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్ ఫరూకీ, జీహెచ్ఎంసీ డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్ లు అందుకున్నారు.
మంగళవారం న్యూఢిల్లీ లోని ప్రవాసీ భారతీయ కేంద్ర లో జరిగిన అవార్డుల ప్రధాసనోత్సవ కార్యక్రమ అనంతరం అవార్డు గహితలు మీడియా తో మాట్లాడారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ, దేశంలో పెద్దపల్లి జిల్లా పెద్దపులి లాంటి జిల్లా గా నిరూపించుకుందని, దేశ వ్యాప్తంగా మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో తొలిస్థానం జిల్లా నిలవడం తమకు గర్వకారణంగా ఉందని, అంగన్ వాడీలలో టాయిలెట్ల నిర్మాణం, వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్చతా విషయంలో మేము సాధించిన ఘనతకు ఈ అవార్డు లభించందన్నారు.స్వచ్చ్ తా విషయం లో జిల్లాలో అనేక సంస్కరణలు చేపట్టామని, ప్రతి శుక్రవారం స్వచ్చ్ వారాన్ని ఏర్పాటు చేసి స్వచ్చతను పెంపొందిస్తున్నామని,గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని,దీంతో దోమలను అరికట్టగలిగామని తద్వారా అంటు వ్యాదులను కొంత వరకు నిరోధించగలిగామని చెప్పారు.సబల పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, బుతు క్రమం సందర్బంలో మహిళలకు కోసం ప్రత్యేకంగా ఈ సబల ప్రాడ్ లను తయారు చేస్తున్నట్లు దేవసేన తెలిపారు.ఇందుకోసం కలెక్టర్ నిధుల నుంచి మహిళలకు ప్రత్యేకంగా నిధులు అందించి తయారు చేస్తున్నామని దేవసేన వివరించారు.

పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ కు స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డు లలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కడం గర్వంగా ఉందన్నారు.స్వచ్చ్ తెలంగాణ పేరుతో సిఎం కేసీఆర్ గొప్ప ముందడుగు వేశారని, ప్రస్తుతం 95 శాతం ఓడిఎఫ్ గా తెలంగాణ నిలిచిందని చెప్పారు.ఈ అక్టోబర్ 2 నాటికీ 100 శాతం ఓడిఎఫ్ సాధించాలని సిఎం కేసీఆర్ మాకు టార్గెట్ గా పెట్టారని నీతూ కుమారీ ప్రసాద్ పేర్కొన్నారు.నాణ్యత తో‌ కూడిన టాయిలెట్లను నిర్మించడమే లక్ష్యం గా పని చేశామని,అందువల్ల పూర్తి స్థాయిలో మా టార్గెట్ ను చేరుకోలేక పోయామని, రెండు, మూడు నెలల్లో 100 శాతం ఓడిఎఫ్ ను సాధిస్తామని నీతూ ప్రసాద్ వెల్లడించారు.ఓడిఎఫ్ ఒక్కటే కాదని, ఓడిఎఫ్ ప్లెస్ లోనూ తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.టాయిలెట్లతో పాటూ, బాత్రూంలను నిర్మించుకొని స్వచ్చ్ సర్వేక్షణ్ లో తెలంగాణ ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చారని ఆమె తెలిపారు.వచ్చే ఏడాది మరిన్ని అవార్డులతో అగ్రగామిగా నిలుస్తామనీ నీతూ కుమారి ప్రసాద్ వివరించారు.జిహెచ్ఎంసీ, అదనపు కమీషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానంలో వరంగల్ నిలవడం సంతోషంగా ఉందని, వరంగల్ అర్బన్ ప్రజల సహకారం తోనే ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు.వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా స్వచ్చ్ సర్వేక్షణ్ లో చేసిన కృషికి ఈ అవార్డు లభించిందని ఆమ్రపాలి వివరించారు.టాయిలెట్ల, నిర్మాణం వాటి ఉపయోగం లో వరంగల్ ప్రజలకు చాలా అవగాహన పెరిగిందని, జీహెచ్ఎంసీ అదనపు కమీషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.అనంతరం జిహెచ్ఎంసి, అదనపు కమిషనర్ ముషారఫ్ ఫారూకీ మాట్లాడుతూ,దేశంలోనే స్వచ్చ్ ఐకాన్ గా చార్మినార్ నిలవడం గర్వంగాఉందన్నారు.కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే చార్మినార్ ను స్వచ్చ్ ఐకాన్ గా నిలపగలిగామని,మొదటగా ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా చార్మినార్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించామని పేర్కొంటు, రోజు దాదాపు 30 నుంచి 50 వేల మంది పర్యాటకులు చార్మినార్ ను సందర్శిస్తారని ముషారఫ్ తెలిపారు.ఇలాంటి సందర్భంలో స్వచ్చతా కోసం పలు చర్యలను అమలు చేస్తున్నామని, ముషారఫ్ ఫారూకీ వెల్లడించారు.