తెలంగాణలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం.- చీఫ్ సెక్రటరీ జోషీ.

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలలలోనే దేశంలోనే అత్యుత్తమైన టియస్ ఐ పాస్ పాలసీని రూపకల్పన చేసి వివిధ పరిశ్రమలకు సత్వర అనుమతులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.భారత దేశంలోని వివిధ రాష్ట్రాలను విదేశాలలో ప్రమోట్ చేయడంలో భాగంగా, భారత రాయబారుల బృందం వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధవారం సచివాలయంలో సమావేశమైనది.ఈ సమావేశంలో వివిధ దేశాలలో పనిచేస్తున్న భారత రాయబారుల లతో పాటు పరిశ్రమల శాఖ కమీషనర్ నదీం అహ్మద్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్వింధర్ సింగ్, RWS ఈఎన్ సి సురేందర్ రెడ్డి, టిఎస్ఐఐసి యం.డి వెంకట నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యుత్తమైన పారిశ్రామిక విధానం ద్వారా దేశం దృష్టిని ఆకర్శించామని, 1,30,216 కోట్ల పెట్టుబడి విలువగల 7337 యూనిట్లకు అనుమతులిచ్చామని దీని ద్వారా 6 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, ఇప్పటికే 4884 యూనిట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో మొదటి స్ధానంలో నిలుస్తున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, తగినంత భూమి అందుబాటులో ఉందని పలు సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం ఇటువంటి పర్యటనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.టియస్ ఐఐసి ద్వారా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని వివిధ పార్కులలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఐటి, బయోటెక్నాలజీ, ఫార్మా, టెక్స్ టైల్ లాంటి 165 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని రాష్ట్రంలో ఫార్మాసిటి,నిమ్జ్, టెక్స్ టైల్ పార్క్, యంఎస్ యంఇ సీడ్ పార్క్, ఫుడ్ పార్క్ లాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కున వ్యయంతో పరిశ్రమలు స్ధాపించవచ్చని, వాతావరణ పరంగా ఎంతో అనుకూలమైన ప్రదేశమని సి.యస్ వివరించారు.వ్యవసాయ రంగానికి సంబంధించి మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా రైతులకు ఎకరానికి సీజన్ కు 4 వేల చొప్పున పంట పెట్టుబడి, ఉచిత భీమా అందిస్తున్నామన్నారు. జనవరి 2018 నుండి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను రైతులకు అందిస్తున్నామని, 18.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్స్ నిర్మించామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి వివరించారు.మిషన్ కాకతీయ ద్వారా 27742 చెరువులలో పూడికతీత అభివృద్ధి పనులు చేపట్టామని, 8.25 టి.యం.సి ల అదనపు స్టోరేజి సామర్ధ్యాన్ని క్రియేట్ చేశామని ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు.
తెలంగాణలో టూరిజంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని మెడికల్,హెరిటేజ్, ఎకో, బుద్దిజం, కల్చరల్, టూరిజం ఉందని, 2.5 లక్షల మంది విదేశీయులు తెలంగాణలో పర్యటిస్తున్నారని టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం వివరించారు.రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించే బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నామన్నారు. 40 వేల కోట్లకు పైగా ప్రతి ఇంటికి మంచినీరందిస్తామన్నారు.
ఫిన్ లాండ్ లో పనిచేస్తున్న భారత రాయబారి వాణీరావు మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటి, ఈ గవర్నెన్స్, ఎకోసిస్టమ్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వీటిని తెలంగాణ రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలన్నారు.పెరూ లో భారత రాయబారి యం.సుబ్బారాయుడు మాట్లాడుతూ లాటిన్ ఆమెరికాలో వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని మైనింగ్,ఇంధనరంగం, గ్రైన్స్ లో అవకాశాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.సిషెల్స్ భారత రాయబారి ఔసఫ్ సయీద్ మాట్లాడుతూ ఫార్మా టూరిజం రంగంలో అవకాశాలను పొందలన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్రమోషనల్ ఈవెంట్ ను సిషెల్స్ లో నిర్వహిస్తామని అందుకు సహకారం అందించాలని, తెలంగాణ నుండి సాంస్కృతిక బృందాన్ని పంపే అంశాన్ని పరిశీలించాలన్నారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తెలంగాణ టూరీజం పై దృశ్యరూప షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించిన అనంతరం తెలంగాణ సి.యస్ మెమోంటోలను ప్రధానం చేశారు