తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ రాష్ట్ర విద్యుత్ , యస్ సి అభివృద్ధి శాఖామంత్రి జగదీష్ రెడ్డి సందేశం.

సూర్యాపేట:
ఈ నాలుగు సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలన పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది..20శాతం వృద్ధి రేటు తో అభివృద్ధి లో దేశంలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.. నాలుగు సంవత్సరాల క్రితం ఉనికిలో నే లేని ఒక రాష్ట్రం దేశమంతా ఉలిక్కిపడి తన వైపు చూసేలా తలెత్తుకొని గర్వంగా నిలబడడం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దీక్షా దక్షతలకు నిదర్శనం….అంకెల విషయం పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజానికం ఆత్మ విశ్వాసం తో ,ఆత్మ స్థైర్యం తో నిలబడే పరిస్థితి కేవలం నాలుగంటే నాలుగేళ్ళలోనే సాధించడం అనితర సాధ్యం….
ఓ వైపు ఆసరా పెన్షన్ల రూపంలో వృద్దులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు, వికలాంగులు,గీత కార్మికులు, నేతన్నల సంక్షేమానికి నెలనెలా ఇస్తున్న వెయ్యి.,పదిహేను వందల రూపాయలు ఇస్తున్న భరోసా ఇంతా అంతా కాదు…అరవై ఏండ్లుగా చితికి పోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టి వ్యవసాయంతో పాటు వివిధ వృత్తులలో జీవిస్తున్న వారికి భరోసా ఇస్తూ గొర్రెలు, చేపల పెంపకం దారులకు మరొక వైపు నాయిబ్రాహ్మణ ,రజక తదితర వృత్తుల నైపుణ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేశాయి….. రైతులకు రుణమాఫీ తో ప్రారంభమైన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి ఎరువులు, విత్తనాలు రైతాంగానికి అందుబాటులో ఉంచడం.,వ్యవసాయ యాంత్రీకరణ, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పునర్నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల రూపకల్పన, వేగంగా పూర్తి చేయడం, భూ రికార్డు ల ప్రక్షాళన , గోదాముల నిర్మాణం తో పాటు ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి పంటల కొనుగోలు చేసి , రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందించిన కార్యక్రమాలు రాష్ట్ర రైతాంగంలో పూర్తి విశ్వాసాన్ని నింపాయి….
ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగేళ్ళ క్రితం నాడు దండగనుకున్న వ్యవసాయం ఇవాళ పండగ అయిందనడంలో సందేహం లేదు…
కెసిఆర్ గారి నలభై సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవమే ఈ రాష్ట్రంలో ఇంత తక్కువ కాలంలో అంత గొప్ప అభివృద్ధి కి బాటలు వేసింది.