తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభంజనం తెలంగాణకు పీడ విరగడకు సమయం ఆసన్నం.- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.

హైదరాబాద్:

కేసీఆర్ తన గొయ్యి తానే తొవ్వుకున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అన్నారు.తెలివి ఎక్కువయ్యి..కారణం లేకుండా అసెంబ్లీ రద్దు చేసుకున్నారని చెప్పారు.ఎవరు ఔనన్నా కాదన్నా…తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. హైదరాబాద్ పై ఆంక్షలు లేకుండా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ ఆయన కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.తెలంగాణ ముసుగు పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు.మద్యం పంచి ఎన్నికలు గెలవాలని టీఆరెస్ చూస్తోందన్నారు. మూడేండ్లలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తా అన్నాడు..ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. 50 వేల కోట్లు ఖర్చుపెట్టిండు కానీ…నల్లా నీళ్లు మాత్రం రాలేదన్నారు.కేసీఆర్ ఓ మోసకారి.. అబద్ధాల కోరు అని ఆరోపించారు.నెరేళ్లలో దళితులను చిత్ర హింసలు పెట్టిన trs ని…రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.కేటీఆర్..ఔను పొగరుబోతునే అన్నాడని గుర్తు చేశారు.”నీ పొగరు అనచటానికే సిద్ధమైంది తెలంగాణా సమాజం. ఆంధ్ర పార్టీతో పొత్తులు అంటున్నాడు. టీడీపీ రమణ..ఆంధ్రనా… తెలంగాణ నా..కోదండరాం… చాడా వెంకట్ రెడ్డి లు ఎక్కడి వాళ్ళు? కండ్లు నెత్తికెక్కిన trs పాలనకు స్వస్తి పలకాలి. trs ని బొంద పెట్టాలి.కేసీఆర్ కుటుంబం తప్ప trs లో ఎవరూ ఉండరు. అంతా కాంగ్రెస్ వైపే వస్తారు.కేసీఆర్ ఫామ్ హౌస్ కి..కేటీఆర్ అమెరికాకు పరిమితం అవుతారు.

మానకొండూరు.. గూడెం గ్రామంలో ముగ్గురు దళితులు పెట్రోల్ పోసుకుని చనిపోయినా చలనం రాలేదు టిఆర్ఎస్ కి. కొండగట్టు లో ఆర్టీసీ బస్సులో 63 మంది చనిపోతే..కనీసం పరామర్శించి సమయం కూడా లేదు సీఎంకు. స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదు కేటీఆర్.

రాజకీయాల్లో ఉండాల్సిన విజ్ఞత కూడా లేదు.
ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పొగరెక్కిన వాళ్లకు బుద్ధి చెప్పటానికి సిద్ధమయ్యారు.
ఈ 45 డేస్ అప్రమతంగా ఉండండి. మన నుండి దోచుకున్న సొమ్మునే వల్ల అభ్యర్థులకు పంపుతున్నారు కేసీఆర్.45 రోజులు పార్టీ కోసం పనిచేయండి…ఐదేన్లు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తాం. ఒక్కొక్కరు..కాంగ్రెస్ కి వంద ఓట్లు వేయించండి. అందరూ అప్రమతంగా ఉండండి. బెజ్జంకి ని ప్రజలు కోరితే కరీంనగర్ లో కలుపుతాం” అని ఉత్తమ్ చెప్పారు.