తెలంగాణ అమరులకు నివాళి.

సిద్ధిపేట :
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఉదయం 4వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ లతో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం సిద్ధిపేట ప్రశాంతినగర్-కోటి లింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీసీపీ నర్సింహ్మారెడ్డి, ఆర్డీఓ ముత్యం రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.