‘తెలంగాణ’ కేసీఆర్‌ కుటుంబం కోసమేనా!! -బాబూ మోహన్

సంగారెడ్డి:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత బాబూమోహన్ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ..‘‘ తెలంగాణ వచ్చిందని చాలా ఆనంద పడ్డాను. తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చిందనుకున్నాను. కానీ.. కేసీఆర్ పాలన అహో.. ఓహో అనుకున్నా. నీళ్లు ఇవ్వకుముందే ఓట్లు అడుగుతున్నారు. నాకు టిక్కెట్ ఇచ్చేముందు ఇప్పుడు టిక్కెట్ఇచ్చిన బ్రోకర్‌కే ఇవ్వొచ్చు కదా?. కొడుకు కోసమే ఎన్నికలు. వద్దంటే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు. దళితున్ని సీఎం చేస్తానని మోసగించారు.బీజేపీ దళితులను గౌరవించే పార్టీ కాబట్టే బీజేపీలో చేరాను. దళితులను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ. మెడ నరుక్కుంటానన్నాయన టికెట్ ఇవ్వలేదు. అర్జంటుగా సీఎం కావాలని కొడుకు, బిడ్డ, అల్లుడూ, మనవడికి ఉంది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా?. మోదీ ఒక్క పైసా అప్పు తేలేదు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయి. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే మంత్రి హరీశ్ ఇంటి గేట్ దగ్గరే ఉంటారు. ఇటువంటి