తెలంగాణ గోస తెలిసిన కేసీఆర్ రైతు బంధువు.శ్రీరాముని సన్నిధిలో రాజకీయ శిక్షణ-తుమ్మల నాగేశ్వరరావు.

భద్రాద్రి:
తెలంగాణ ప్రజల గోస తెలిసినందువల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడయ్యారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం టీఆరెస్ నాయకులు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులను భద్రాచలంలో నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ పథకాలు, రాబోయే ఎన్నికల వ్యూహం, నాయకత్వ లక్షణాలు, నీటి వనరులు, రైతు సంక్షేమం, తెలంగాణ సంస్కృతి-రాజకీయాలు, దేశంలో తెలంగాణ కు లభించిన గుర్తింపు సహా పలు అంశాలపై ఆయా రంగాల నిపుణులు శిక్షణ ఇస్తున్నారు.ముందుగా
టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఐడీసీ చైర్మన్ ఎస్.బీ బేగ్, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు.పార్టీ నాయకులు, కార్యకర్తలకు క్రమశిక్షణ అవసరం అని తుమ్మల అభిప్రాయ పడ్డారు.పట్టబడితే అసాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర సాధనతో సీఎం కేసీఆర్ రుజువు చేసినట్లు మంత్రి తెలిపారు.ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామనే విషయం ప్రజలకు చేరవలసి ఉందన్నారు.పాలేరు ను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని అన్నారు. కేసీఆర్ తో కలిసి వచ్చిన వివిధ పార్టీల నాయకులంత ఐక్యత తో పని చెయ్యాలని కోరారు.