తెలంగాణ ద్రోహులతో యుద్ధమే ఎన్నికలు.

హైదరాబాద్:

తెలంగాణ సాధకులకు,తెలంగాణ ద్రోహులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నట్టు మంత్రి హరీశ్ రావు అన్నారు.రాష్ట్రంలో పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయని విమర్శించారు.ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెబుదామన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ మాట్లాడుతున్నారని, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ కు అన్యాయం చేసారని హరీశ్ విమర్శించారు తెలంగాణ వివక్షకు కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.తెలంగాణకు అడ్డం పార్టీ టిడిపి అని అన్నారు.కొడంగల్ కు పాలమూరు పథకం ద్వారా నీళ్లు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.మహబూబ్ నగర్ కు అన్యాయం చేసింది చంద్రబాబేనని, ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డం పడుతున్నాడని ఆరోపించారు.

కోదండరామ్ కు రైతుల ఉసురు తప్పక తగులుతుందన్నారు.సర్వశక్తులు ఒడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసాడన్నారు.దిమ్మ తిరిగే తీర్పు కొడంగల్ లో ఇవ్వాలని హరీశ్ కోరారు.కొడంగల్ లో మొన్నటి దాక ఉన్న ఎమ్మెల్యేకు మాటలు ఎక్కువ,చేతలు తక్కువ అని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో కొడంగల్ టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు.
హాజరైన మహేందర్ రెడ్డి, గుర్నాధరెడ్డి హాజరయ్యారు.