తెలంగాణ ధనిక రాష్ట్రమేనా?

తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లలోనే ధనిక రాష్ట్రంగా మారిపోయిందా?ధనిక రాష్ట్రమంటే రాష్ట్రం ధనికమా,లేక ప్రజలు ధనికులయ్యారా?అభివృద్ధి వృద్ధిరేటు పెరిగితే ప్రజలు ధనవంతులయినట్లేనా?మానావభివ్రుద్ధిలో, సామాజిక అభివృద్ధిలో తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నది. తెలంగాణలో పేదరికం ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.మానవ వనరుల అబివృద్ధి జరగలేదని అర్థమవుతుంది.మానవాభివ్రుద్ధి అంటే తాగునీటి సరఫరా, అక్షరాస్యత,వైద్య ఆరోగ్య సౌకర్యాలు, పారిశుధ్యం, బాల్యవివాహాలు తదితర అనేక అంశాలను ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకుంటారు.

హైదరాబాద్:
ప్రజల్ని నమ్మించడానికి,ఉద్యమాలకు సమీకరించడానికి 2014 వరకు పాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని కెసిఆర్ తెలంగాణా ఉద్యమ కాలంలో బలంగా ప్రచారం చేశారు.తెలంగాణ వెనుకబాటుతనానికి,ఆర్ధిక అసమానతలకు ఉమ్మడి పాలకులే కారణమని ఆయన విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు.ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందని,తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కెసిఆర్ గత కొంతకాలంగా పదే పదే చెబుతున్నారు.విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.నిజంగా తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లలోనే ధనిక రాష్ట్రంగా మారిపోయిందా?ధనిక రాష్ట్రమంటే రాష్ట్రం ధనికమా,లేక ప్రజలు ధనికులయ్యారా?అభివృద్ధి వృద్ధిరేటు పెరిగితే ప్రజలు ధనవంతులయినట్లేనా?మానావభివ్రుద్ధిలో, సామాజిక అభివృద్ధిలో తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నది. తెలంగాణలో పేదరికం ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.మానవ వనరుల అబివృద్ధి జరగలేదని అర్థమవుతుంది.మానవాభివ్రుద్ధి అంటే తాగునీటి సరఫరా, అక్షరాస్యత,వైద్య ఆరోగ్య సౌకర్యాలు, పారిశుధ్యం, బాల్యవివాహాలు తదితర అనేక అంశాలను ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకుంటారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటిపరీక్షలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించడం విశేషం. ఇంటింటికీ కంటి పరీక్షలు పేరిట ప్రతి పౌరుడికీ కంటి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తిచేయాలని కూడా సీఎం నిర్దేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని రంగంలోకి దిగాలని సూచించారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక, ఆచరణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. వైద్యబృందం గ్రామాల్లో పర్యటించే సందర్భంలో అవసరమయ్యే రవాణా, భోజన, బస ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేయాలి. కంటి పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలి అని సీఎం మార్గనిర్దేశనం చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ప్రజలు కంటి జబ్బులతో బాధపడుతున్నారని అన్నారు. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేకపోవడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో.. అవగాహన లేకపోవడం వల్లనో చికిత్సకు దూరంగా ఉంటున్నారని కెసిఆర్ అభిప్రాయం.ప్రభుత్వం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సి.ఎం.పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వైద్యశిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకొనేలా చైతన్యపరచాలని కోరారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘా లు, మహిళా సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.తెలంగాణలో 18 సంవత్సరాలలోపు బాలికలకు పెళ్ళిళ్ళు అధికంగా జరుగుతున్నాయి.అలాగే వితంతువుల సంఖ్య కూడా ఎక్కువ అని తేలింది.అందులోనూ యువ వితంతువుల సంఖ్య అధికం.మహిళల స్థితిగతులు తెలంగాణలో మారలేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు.పనిచేయడానికి, కష్టపడడానికి వారు సిద్ధంగా ఉన్నా ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత వారికి లేదు.అందువల్ల ఆయా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు.ఉద్యోగాల కల్పన తెలంగాణ ఉద్యమంలో కీలక డిమాండ్ అయినప్పుడు నిరుద్యోగులకు మారుతున్న సాంకేతిక, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వవలసిన ఉన్నది.తగిన చోట ఉద్యోగ అవకాశాలు కల్పించవలసి ఉన్నది.1956 నుంచి 2014 వరకు తెలంగాణలో చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం 59 శాతం కుదించుకుపోయింది. నీళ్ళు, నిధులు, నియామాకాల ట్యాగ్ లైను తో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది.మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నది.ఇక ఆదివాసులకు,లంబాడాలకు మధ్య వైషమ్యాలు పెరుగుతున్నవి.ఈ రెండు వర్గాల మధ్య అసమానతలు సామాజిక,ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నవి.అలాగే ఎస్.సి. లలో మాల, మాదిగల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి.గిరిజన ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది.ఈ ఘర్షణ వాతావరణం కొన్నిచోట్ల తగ్గినట్టు కనిపిస్తున్నా నివురుగప్పిన నిప్పు వలె ఉన్నది.కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మిస్తున్నారు.ఆయా భారీ ప్రాజెక్టులపై వేలాదికోట్లు వెచ్చిస్తున్నారు.అయితే ఈ సాగునీటి ప్రాజెక్టులతో భూమి లేని లక్షలాది మంది పేద రైతుకూలీలకు ఏమి ఉపయోగం?ఇందులో దాదాపు అత్యధిక శాతం మంది దళితులే.ఆంధ్రాలో సాగునీటివసతి పెరిగిన ప్రాంతాల్లో కూడా భూ యాజమాన్య సంబంధాలలో ఎలాంటి మార్పు కానరావడం లేదు.తెలంగాణ వ్యవసాయరంగంలో పనిచేసే రైతుకూలీలు ఎక్కువగా మహిళలే.నగరీకరణ పెరుగుతుండడంతో పురుషులు పట్టణాలకు ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు గ్రామాల్లో, పొలాల్లో మహిళలే కనిపిస్తున్నారు.
1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ మొత్తం అప్పులు1,67,091కోట్లు.అంటే 67 సంవత్సరాలల్లో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 70వేల కోట్లు అప్పులు మోపితే సీఎం కేసీఆర్ ఒక్కరే మూడేండ్లలొనే 87వేల కోట్లకు పైగా అప్పులు మోపి, వడ్డీలకే నెలకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మనం రాబోయే 5 ఏండ్లల్లో బీహార్, ఒరిస్సా కంటే అద్వాన్నం కానున్నమా? ప్రస్తుతం 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో సగటు పౌరునిపై ఉన్న అప్పు భారం 45,000 రూపాయలు.పెరిగిన అప్పును సైతం గుణాత్మక మార్పుగా ప్రచారం చేసుకోవడంలో కెసిఆర్ వెనుకాడడం లేదు.
సిరిసంపదలు, ఆర్థిక పరిపుష్టితో “అమెరికా”నే తలదన్నిన “వెనిజులా”దేశం మితిమీరిన ఖర్చులు, లోపించిన ఆర్థిక క్రమశిక్షణతో చిల్లి గవ్వ లేక, ప్రజలకు అన్నం కూడా దొరకని ఘోర పరిస్థితినిఇప్పుడు ఎదుర్కొంటున్నది. ‘కడుపు కట్టుకొని పనిచేస్తాము-బంగారు తెలంగాణా సాధిస్తాము” అని ఉద్యమకారుల చెమట,రక్తం, ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణకు తొలి పాలకులు అన్నారు.తెలంగాణ క్రమంగా అప్పుల ఊబిలోకి పోతుందా? అని అనిపిస్తుంది.