తెలంగాణ పీసీసీ కొత్త కమిటీ నియామకం.

న్యూఢిల్లీ:
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

మరో 9 అనుబంధ కమిటీలను నియమించిన రాహుల్ గాంధీ.

కోర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, క్యాంపేయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రేటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, LDMRC కమిటీ, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పేరుతో అనుబంధ కమిటీలు

*కోర్ కమిటీలో* రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్‌తో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్, జి. చిన్నారెడ్డి, ఎ. సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి

53 మందితో కోఆర్డినేషన్ కమిటీ. చైర్మన్‌గా కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా అన్ని కమిటీల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తదితరులు సభ్యులు

*ప్రచార కమిటీ (క్యాంపెయిన్ కమిటీ) ఛైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క*, కో-ఛైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్, మరో 14 మంది సభ్యులు

ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో 41 మంది సభ్యులు, మరో 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు. దీనికి నేతృత్వం పీసీసీ అధ్యక్షుడు

*మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ,* కో-చైర్‌పర్సన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్‌గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, మరో 32 మంది సభ్యులు

*స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్‌గా వీ. హనుమంతరావు,* కో-చైర్‌పర్సన్లుగా సర్వే సత్యనారాయణ, మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్ రెడ్డి, మరో 15 మంది సభ్యులు

*ఎల్డీఎంఆర్సీ కమిటీ ఛైర్మన్‌గా ఆరెపల్లి మోహన్,* కో-ఛైర్‌పర్సన్‌గా డి. రవీందర్ నాయక్, కన్వీనర్‌గా హెచ్. వేణుగోపాల్ రావు

*ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి,* కో-చైర్‌పర్సన్‌గా కమలాకర్ రావు, కన్వీనర్‌గా జి. నిరంజన్, మరో ఆరుగురు సభ్యులు

*డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎం. కోదండ రెడ్డి,* కో-ఛైర్‌పర్సన్‌గా ఏ. శ్యాంమోహన్, కన్వీనర్‌గా బి. కమలాకర్ రావు, నంది ఎల్లయ్య, సంభాని చంద్రశేఖర్, పి. బలరాం నాయక్, సీజే శ్రీనివాసరావు