తెలంగాణ ప్రజల్లో గుణాత్మక మార్పు – మంత్రి జగదీశ్ రెడ్డి.

నల్లగొండ:
నల్లగొండ లో హరితహారం లో మొక్కలు నాటి మేలుజాతి పశు ప్రదర్శన, పాడి రైతుల అవగాహన సదస్సు ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి,ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి,అటవీ సంస్థ ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డి.
mla లు వీరేశం, గాదరి కిషోర్ , భాస్కర్ రావు, నల్లగొండ అసెంబ్లీ ఇంచార్జి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.ప్రతిపక్షాలకు పని, పాట,సోయి లేదని,ప్రతి పథకాన్ని విమర్శిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ పథకాలను విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు కులవృత్తులను ఆవమానిస్తున్నట్టు ఆయన అన్నారు.కులవృత్తులకు చేయూత ఇస్తూ సీఎం కేసీఆర్ గ్రామీణ జీవనాన్ని బ్రతికిస్తున్నారని చెప్పారు.కనీసం మంచి నీటిని కూడా అందించకుండా గత ప్రభుత్వాలు నల్లగొండ జిల్లా ను సర్వ నాశనం చేశారని విమర్శించారు.తెలంగాణా రైతుల పట్టుదల అమోఘం.వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తూ తెలంగాణ కు ఘన కీర్తిని సాధించిపెట్టారని జగదీశ్ రెడ్డి తెలిపారు.కేవలం గత పాలకుల వైఫల్యం వల్లనే రైతులు అధోగతి పాలయ్యారని చెప్పారు.సబ్భoడ వర్గాల ప్రజలు, అణగారిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే బంగారు తెలంగాణా అని మంత్రి అన్నారు.సీఎం కేసీఆర్ రేయింబవళ్లు శ్రమిస్తూ తెలంగాణా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం పాటు పడుతున్నారని తెలిపారు.ఇప్పటికే ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని మంత్రి చెప్పారు.