తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం!!

హైదరాబాద్:

తెలంగాణ బీజేపీ మొదటి లిస్టు ప్రకటించడం కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపింది. అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు. పార్టీలో రెండో లిస్టు అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఇప్పుడు పార్టీలో కొత్తగా చేరినవారికి టిక్కెట్ రావడంతో… ఆయా నియోజకవర్గంలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి టిక్కెట్ రాకపోవడంతో వారు సోమవారం పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అదిలాబాద్‌కు చెందిన కొందరు బీజేపీ నేతలు పార్టీ కార్యాలయం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. పాతవారికి టిక్కెట్ ఇవ్వకుండా కొత్తవారికి సీటు ఇవ్వడంతో వారు మండిపడుతున్నారు. అలాగే నిన్న రాంమాధవ్.. లక్ష్మణ్‌ను సీఎం అభ్యర్థి అని ప్రకటించడంతో పార్టీలో సీనియర్ నేతలు కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ విధానపరంగా చూస్తే ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించదని వారన్నారు.