తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర శూన్యం. – ఆజాద్ వ్యాఖ్యలు.

హైదరాబాద్:

తెలంగాణ ఏర్పాటులో టీఆరెస్ పాత్ర లేనే లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ అజాద్ అన్నారు. కనీసం టీఆరెస్ తో మేము చర్చలు కూడా చేయలేదని కూడ చెప్పారు.అప్పటి ఎంపీ లతో అనేక సార్లు చర్చించిన విషయం గుర్తు చేశారు.ఆంధ్ర కు చెందిన తమ ఎంపీలు సభను నాడు అడ్డుకున్నారన్నారు.అయినా టీఆరెస్ అబద్దం చెబుతున్నదన్నారు.తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అని ఆజాద్ స్పష్టం చేశారు.

దుక్కిదున్ని విత్తనాలు నాటి పంట చేతికొచ్చాక టీఆరెస్ కోసుకెళ్లినట్లుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ను వోడించి తప్పుచేసినట్టు

తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యారని తెలిపారు.టీఆరెస్ ,బీజేపీ దొందు దొందే అని చెప్పారు.మోడీ ,కేసీఆర్ లు ఉద్యోగాలు ఇస్తామని యువతను చీట్ చేశారని విమర్శించారు.రైతులకు మద్దతు ధర కల్పిస్తామన్న మోడీ ,కేసీఆర్ లు విఫలమయ్యారన్నారు.రైతుల నుండి పంటను కొనుగోలు చేసిన వారే లేరని తెలిపారు.మిగులు బడ్జెట్ ఉండి తెలంగాణ సర్కార్ ఎందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఇవ్వడంలేదని ప్రశ్నించారు.కేసీఆర్ పాలనలో ముప్పై శాతం విద్యా సంస్థలు ముతపడ్డాయని ఆజాద్ మండి పడ్డారు.కెసిఆర్ ముస్లింలను రిజర్వేషన్ ల పేరుతో చీట్ చేశారని విమర్శించారు.ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దని తెలిపారు.టెక్నీకల్ కా సాధ్యం కానందున నాడు నాలుగు శాతం ఇచ్చామన్నారు. 12శాతం సాధ్యం కాదని తెలిసే కెసిఆర్ ..మోసం చేశారన్నారు. ముస్లిం ల ఆర్టిఫిషల్ సానుభూతి కోసమే కేసీఆర్ రిజర్వేషన్ లు అన్నారు.మోడీ ,కేసీఆర్ లు అన్ని వర్గాల ప్రజలను చీట్ చేశారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రతిసారి చెప్పేవి అన్ని అబద్దాలే నన్నారు.ప్రతి అడుగులో కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలని ఆజాద్ మండిపడ్డారు.సోనియాను కలిసి నప్పుడు టీఆరెస్ ను విలీనం చేస్తానని

కేసీఆర్ అబద్దాలు చెప్పారని విమర్శించారు.

లైక్ మైండెట్ పార్టీలతో తప్పక కాంగ్రెస్ కలిసి పనిచేస్తామన్నారు.టీఆరెస్ పార్లమెంట్ లో సప్పోర్ట్ చేస్తుందని,ఇక్కడ బీజేపీని విమర్శిస్తోందన్నారు.నోట్ల రద్దు, ఉపరాష్ట్ర పతి ఇలా ప్రతి సారి టీఆరెస్ బీజేపీ కీ మద్దతు ఇచ్చింది నిజం కాదా ..? అని ప్రశ్నించారు.ఓవైసీ ..ఎవరు అధికారంలో ఉంటె వారితోనే ఉంటుందన్నారు.ఎంఐఎం వి సర్కార్ పాలిటిక్స్ అని అన్నారు.గాంధీ ఫ్యాఅమిలి కీ కేసీఆర్ కుటుంబానికి పోలికే లేదన్నారు.నెహ్రు ,ఇందిరా ,రాజీవ్ ,లేవరు తమ కొడుకు ,కూతురు ,అల్లుడిని మంత్రులుగా చేయలేదన్నారు.