తెలంగాణ వెనుకబడిన జిల్లాలకు కేంద్ర నిధులు.

న్యూఢిల్లీ:

తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లాలకు రూ.450 కోట్లు మంజూరు చేసింది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో 9 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 7 జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల పేరుతో నిధులు కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఆరు నెలల ఆలస్యంగా నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఇవాళ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.