తెలంగాణ శాసనమండలి సమావేశం.

హైదరాబాద్:

అసెంబ్లీ రద్దయిన తర్వాత తెలంగాణ శాసనమండలి గురువారం సమావేశం కానుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో శాసన మండలి సమావేశానికి హాజరు అవుతున్న కేసీఆర్. శాసనమండలిలో నాలుగు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ లకు శాసనమండలిలో సంతాపం తెలపనున్నారు.కొండగట్టు లో బస్సు ప్రమాదంలో మృతిచెందిన ప్రయాణికులకు, కేరళ వరద బాధిత మృతులకుశాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్శా సనమండలిలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.