”థూ.. మీ బతుకులు చెడ”. తెలంగాణ సెంటిమెంటు మండించిన కేసీఆర్.

” తెలంగాణా ద్రోహి చంద్రబాబుతో సిగ్గు లేకుండా పొత్తేమిటి? థు.. మీ బతుకులు చెడ. అడుక్కుంటే నేనే ఇచ్చేవాడ్ని కదా నాలుగు సీట్లు” అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీ టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో ఒక ‘కూటమి’ కట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచే కాంగ్రెస్ పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పెద్ద ఎత్తున ‘దాడులకు’ దిగుతున్నారు. కేసీఆర్ ఆ ‘దాడుల’ కు డోసు పెంచారు. ” ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో… ఆ ద్రోహి చంద్రబాబుతో పొత్తా ?కరెంటు ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? ” అని కేసీఆర్ చెండాడిన తీరు టివి న్యూస్ చానళ్లలో ప్రత్యక్షప్రసారంలో చూడవలసిందే తప్ప ఆయన హావభావాలను, ఆగ్రహాన్ని, అసహనాన్ని మాటల్లో వ్యక్తపరచడం సాధ్యం కాదు. ” అడిగితే నాలుగు సీట్లు నేనే ఇచ్చేవాడ్ని” అనడాన్ని బట్టి తెలంగాణ’’ ద్రోహి’’ చంద్రబాబు తో పొత్తు పెట్టుకుంటే నాలుగైదు సీట్లు కూడా కాంగ్రెస్ కు రావని కేసీఆర్ చెప్పదలచుకున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరిగే ‘సమరం’ గా మలుపు తిప్పేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ” మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా?” అని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి చంద్రబాబు దర్శకత్వంలో పాలన సాగుతుందని ప్రజల్లో ‘భావోద్రేకాల’ను రగిలించే ప్రయత్నం చేశారు. అయితే నిజంగానే కేసీఆర్ ఊహిస్తున్నట్టు, లేదా అంచనా వేస్తున్నట్టు ‘భావోద్రేకాలు’ ఎన్నికలలో వర్కవుట్ అవుతాయా? అనేది అనుమానమే.

 

ఎస్.కె.జకీర్.

అనుకున్నట్టే జరుగుతున్నది. ‘తెలంగాణ సెంటిమెంటు’ కుంపటిని కేసీఆర్ నిజామాబాద్ లో ముట్టించారు. కొంగరకలాన్, హుస్నాబాద్ సభలతో పోల్చితే ఈ సభలో ప్రతిపక్షాలను దూషించిన వైనంపై ఆసక్తి కలుగుతున్నది. కేసీఆర్ ప్రసంగం టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ళ మూడు నెలల నాలుగు రోజుల పాలనపై ప్రజల తీర్పు కోరడం కన్నా, తమను ఆశీర్వదించి మళ్ళీ అధికారం ఇవ్వవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం కన్నా ‘తెలంగాణ భావోద్రేకాల’ ను రెచ్చగొట్టడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ”వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమూ ఉండవలసిన అవసరం ఉన్నందున నేనే ఒకరిద్దరిని ప్రతిపక్షానికి నామినేట్ చేయవలసి రావొచ్చు” అని1999 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్టు సీనియర్ జర్నలిస్టు ఒకరు గుర్తు చేశారు. ” తెలంగాణా ద్రోహి చంద్రబాబుతో సిగ్గు లేకుండా పొత్తేమిటి? థు.. మీ బతుకులు చెడ. అడుక్కుంటే నేనే ఇచ్చేవాడ్ని కదా నాలుగు సీట్లు” అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీ టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో ఒక ‘కూటమి’ కట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచే కాంగ్రెస్ పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పెద్ద ఎత్తున ‘దాడులకు’ దిగుతున్నారు. కేసీఆర్ ఆ ‘దాడుల’ కు డోసు పెంచారు. ” ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో… ఆ ద్రోహి చంద్రబాబుతో పొత్తా ?కరెంటు ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? ” అని కేసీఆర్ చెండాడిన తీరు టివి న్యూస్ చానళ్లలో ప్రత్యక్షప్రసారంలో చూడవలసిందే తప్ప ఆయన హావభావాలను, ఆగ్రహాన్ని, అసహనాన్ని మాటల్లో వ్యక్తపరచడం సాధ్యం కాదు. ” అడిగితే నాలుగు సీట్లు నేనే ఇచ్చేవాడ్ని” అనడాన్ని బట్టి తెలంగాణ’’ ద్రోహి’’ చంద్రబాబు తో పొత్తు పెట్టుకుంటే నాలుగైదు సీట్లు కూడా కాంగ్రెస్ కు రావని కేసీఆర్ చెప్పదలచుకున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరిగే ‘సమరం’ గా మలుపు తిప్పేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ” మళ్ళీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా?” అని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి చంద్రబాబు దర్శకత్వంలో పాలన సాగుతుందని ప్రజల్లో ‘భావోద్రేకాల’ను రగిలించే ప్రయత్నం చేశారు. అయితే నిజంగానే కేసీఆర్ ఊహిస్తున్నట్టు, లేదా అంచనా వేస్తున్నట్టు ‘భావోద్రేకాలు’ ఎన్నికలలో వర్కవుట్ అవుతాయా? అనేది అనుమానమే.

కేసీఆర్ ప్రసంగంలో కొన్ని పరస్పర విరుధ్ధఅంశాలున్నవి. నాలుగు సీట్లు తానేఇచ్చేవాడ్ని కదా ! అంటూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమరావతి, ఢిల్లీ నుంచి పరిపాలన సాగుతుందని ఎలా అనగలరు? రాష్ట్రంలో కనీస ప్రతిపక్షం ఉండాలని 1999 లో చంద్రబాబు అభిలషించారు. కానీ తెలంగాణలో ప్రతిపక్షమే ఉండరాదని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు. అసెంబ్లీలో తమ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ, తాము ఉంటె సరిపోతుందని ఆయన భావిస్తున్నట్టు ఇదివరకే చాలా వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆచరణలో అది సాధ్యమా? కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో, ‘కూటమి’ ఏర్పాటు వల్ల ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందో లేక చతికిలపడుతుందో జోస్యం ఎలా చెప్పగలం. కాగా అసెంబ్లీ ఎన్నికలు ‘ముందస్తు’ గా ఎందుకు జరపాలనుకుంటున్నారన్నదానికీ నిజామాబాద్ సభలోను ప్రజల్ని కేసీఆర్ ‘కన్విన్సు’ చేయలేకపోయారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ”కాంగ్రెసోళ్లుసొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన . వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు”. అని కేసీఆర్ అన్నారు. ‘తిక్కరేగి ప్రభుత్వాన్ని రద్దు చేయడం’ అన్నది రాజకీయ పరిశీలకులకు మింగుడుపడడం లేదు. పైగా ఎప్పటిలాగే సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి ‘9 నెలల అధికారాన్ని త్యాగం చేశామ’ నే వాదనను ముందుకు తీసుకు వచ్చారు. ‘ముందస్తు’ ఎన్నికలకు ప్రజల ఆమోదం ఉన్నదీ, లేనిదీఇప్పుడప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. దానికి మరికొంత సమయం పట్టవచ్చును.

 

తాను ఏమి చేసినా ప్రజలు ఆమోదిస్తారన్న నమ్మకం కేసీఆర్ కు ఉన్నది. అందులో వివాదమేమీ లేదు. ”కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉన్నందున రాష్ట్ర ఆదాయం ఇండియాలోనే నెంబర్ వన్‌గా ఉంది” అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ అవినీతిరహిత పాలన గురించి చెప్పుకున్నారు. ”పదవులంటే ఎడమకాలిచెప్పుల్లావిసిరేశాం. రాష్ట్రం స్థిరత్వంగా ఉండాలనే రద్దు చేశాం” అనడంలో లాజిక్కు కనిపించడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లినా వచ్చే ముప్పు ఏమీ లేదు. పార్టీ లోపల తిరుగుబాటు సంకేతాలు లేవు. వెలుపలి నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టే సూచనలు కూడా లేవు. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. 63 మంది నుంచి 90 మంది దాకా టిఆర్ఎస్ శాసనసభ్యుల బలం పెరగడం కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనన్నది ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చును.’నోటుకు ఓటు’ వ్యవహారం బట్టబయలైనందున తమ ప్రభుత్వాన్ని రక్షించుకోగలిగామన్నది కేసీఆర్ విశ్లేషణ. ”చావు నోట్లో పెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను అమరావతికి పంపిస్తారా?” అని కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ”పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి బట్టెవాజ్అన్నాడు. సీఎంను ఆ మాట అనొచ్చా. బట్టెవాజ్ఎవరు? ఓటు ద్వారా బట్టెవాజ్ ఎవరో చెప్పాలి” అని కేసీఆర్ ఆవేశపూరితంగా పిలుపునిచ్చారు. ”చంద్రబాబు 500 కోట్లు ఇస్తాడంట. మూడు హెలికాప్టర్లు పెడుతారంటా.చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏడు మండలాలు లాక్కున్న చంద్రబాబుతో జతకట్టడం మరోసారి తెలంగాణను మోసం చేయడమే” అని చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూటమి కట్టడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ సందర్భంగా ఆలోచించవలసిన అంశం కాంగ్రెస్ పార్టీ ‘అహోబిలం మఠం’ కాదు. ఆ పార్టీ ఎత్తుగడలు దానికి ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో’తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన’ పార్టీ గా చెప్పుకునే కాంగ్రెస్, కోల్పోయిన అధికారాన్ని ఎట్లా చేజిక్కించుకోవాలని ఆలోచిస్తుంది. ఆ మేరకు వ్యూహాలు పన్నుతుంది. ఎవరి వ్యూహం వారిది. ఎవరి ఎత్తుగడలు వారివి. అంతిమంగా ప్రజల తీర్పు ముఖ్యం. దానికింగా కనీసం 60 రోజులకు పైగా వ్యవధి ఉన్నది. కేసీఆర్ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలకు లభించే జనామోదం పై సర్వత్రా చర్చ సాగుతున్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసులు పెట్టించిన వారు, పరుగెత్తించి కొట్టిన వారు, ఉద్యమాన్ని, కేసీఆర్ ను తూలనాడిన వారు, దుర్భాషలాడినవారుమంత్రిమండలి సభ్యులుగా ఉండడాన్ని కూడా గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే తన మౌలిక భూమిక ‘తెలంగాణ వాదం’ నుంచి దూరమైందని తెలంగాణ మేధావుల వాదన. కేసీఆర్ అనుకూల మేధావులు ఆ జాబితాలో లేరు. వారికి కేసీఆర్ ఏమి చేసినా అది ‘బంగారు తెలంగాణ’ నమూనా గానే కనిపిస్తుంది. తెలంగాణ వాదాన్ని ప్రజాకర్షక, ప్రజామోద వాదంగా మాత్రమే కేసీఆర్ ఎంచుకున్నట్టు అర్దమవుతున్నది.

‘తెలంగాణ వాద’మంటే ఏమిటో కచ్చితంగా నిర్వచించుకుంటేగాని టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎంతవరకు పాటించిందో, ఎక్కడ దూరం జరిగిపోయిందో అర్ధం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏది అనుకుంటే అదే ‘తెలంగాణ వాదం’ అన్న వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు. 2001లో ఆ పార్టీ అవతరించింది. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆలోచనలు 1954లో ఫజలలీ కమిషన్ ముందుకు వచ్చిన వాదనలతో మొదలయ్యాయి. అలా ప్రారంభమైన తెలంగాణ వాదం 1956 పెద్దమనుషుల ఒప్పందంలో, 1957-68 ప్రాంతీయ మండలి వాదనలలో, 1969-72 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో, 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో అనేకరకాలుగా వ్యక్తమయింది.2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. అనంతరం రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయినవి. టిడిపి, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగాయి. క తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అత్యంత ప్రభావ శీలుడైన నాయకునిగా, బలవంతునిగా, సంక్షేమ, అభివృద్ధి కాముకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.’’కే‌సి‌ఆర్ నిజామాబాద్ సభ లో వాడిన బాష తెలంగాణ ప్రజలు తల దించుకునేలా వుంది. తాగుబోతులు కూడా అలాంటి బాష మాట్లాడరు. పదవులు తనకాలిచేప్పులతో సమానమని రాజ్యాంగన్నేఅవమానపరచిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ లో టి‌ఆర్‌ఎస్ పార్టీ పై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతో అసహనంగా మాట్లాడినట్లు ఉంది. ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్ తో లబ్ది పొందాలని చూస్తున్నారు. ఎన్నికలు వస్తే కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందేనని, ఇదంతా ఊహించిందే. అయితే అబద్దపు పునాదులమీద ప్రభుత్వంలోకి వచ్చిన కే‌సి‌ఆర్ నిజ స్వరూపాన్ని ప్రజలు, మేదావులు గుర్తించారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన విద్యార్థులు, మేదావులు, ఉద్యోగులు, కార్మికులే ఆయన ఓటమికి కృషి చేస్తున్నారు. కే‌సి‌ఆర్అధికారంలొకి వచ్చి నాలుగేళ్ళైనసాదించిందేమి లేదు. నోరు తెరిస్తే అబద్దం. ఇలాంటి అబద్దాలు అడే నాయకుడు ప్రపంచంలోనే లేడు. కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్, కవిత, హరీష్ రావులు నలుగురు కలిసి రాష్ట్రం లోని పంచ భుతాలను దోచుకుంటున్నారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కే‌సి‌ఆర్ ఆంధ్రాలో ఏడు మండలాలు విలీనమైతే ప్రదాని మోడితో చెలిమి కొనసాగిస్తున్న కే‌సి‌ఆర్ ఎందుకు అడ్డుకోలేదు’’అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో అన్నారు.