దబ్బనంలో దూరే పట్టుచీర. తిరుమల వెంకన్నకు సమర్పణ.

సిరిసిల్ల.
తిరుమల వెంకన్నస్వామికి సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు అరుదైన చీరను బహూకరించారు. అగ్గిపెట్టెలో చీరను అమర్చి చరిత్ర సృష్టించిన చేనేత కార్మికుడు దివంగత నల్ల పరంధాములు కుమారుడు నల్ల విజయ్ మూడు ఇంచుల దబ్బనంలో దూరే పట్టుచీరను మంగళవారం టీటీడీ ఆలయ అధికారులకు అందజేశారు. 2014లో ఈ చీరను 15 రోజులు శ్రమించి తయారు చేశానని విజయ్ తెలిపారు. త్వరలో 31 జిల్లాల భౌగోళిక చిత్రపటంతో ఉన్న చీరను మంత్రి కేటీఆర్ సాయంతో తయారు చేయబోతున్నానని చెప్పారు.