- ముగ్గురు యువకులకు చిత్రహింసలు.
విజయవాడ:
ముగిసిన మచిలిపట్నం బీచ్ ఫెస్టివల్లో పోలీసుల వివాదం దళిత యువకుల ప్రాణం మీదకు తెచ్చింది.ముగ్గురు యువకులను నాలుగు రోజులుగా స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టిన బందరు పోలీసులు.బీచ్ ఫెస్టివల్లో తాగిన మైకంలో అల్లరి చేసిన 9 మంది యువకులు.
మహిళలకు ఇబ్బందిగా ఉండడంతో అడ్డుకున్న పోలీసులు.అడ్డుకోబోయిన మచిలిపట్నం సీఐని తాగిన మైకంలో కొట్టిన టీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. నాగ ప్రసాద్‌బాబు, ప్రశాంత్‌కుమార్, గోపీలను అరెస్ట్ చేసి నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలో ఉంచిన పోలీసులు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో టీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.యువకుల బంధువులు సెర్చ్ వారెంట్ తేవడంతో కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకులను ఆస్పత్రికి తరలింపు. విషయం బయటకు చెబితే కేసులు బనాయిస్తామని యువకులను, కుటుంబ సభ్యులకు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు.