దసరా నాటికి బొల్లారంకు నల్లా నీరు. -మంత్రి హరీశ్ రావు.

సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం లో మిషన్ భగీరథ్ రిజర్వాయర్ నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. 60 సంవత్సరాలుగా నీళ్ల కోసం బాధ పడ్డాం. ఈ బాధలు తీర్చేలా 18కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశాం. పనులు అతి త్వరలో పూర్తి చేసి.. బొల్లారంలో దసరా నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంజీరా నీళ్లు అందిస్తాం. పనులు చేసే సమయంలో రోడ్ల తవ్వాల్సి ఉంది. ఈ పనులు జరిగే 2/3 నెలలు ప్రజలు సహకరించాలి. బతుకమ్మ పండుగ నాటికి బొల్లారం చెరువులో గుర్రపు డెక్క, చెత్తను తొలగించి సుందరికరించాలని కలెక్టరుకు ఆదేశం.

10 రోజుల్లో బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యున్ని నియమించి. హై రిస్క్ కేంద్రాన్ని ప్రారంభించాలని కలెక్టరుకు ఆదేశం.
ముఖ్యమంత్రితో మాట్లాడి అతి త్వరలో మహిళా పొదుపు సంఘాల వడ్డీ లేని రుణం నిధులు విడుదల చేపిస్తాం.బొల్లారంలో మినీ ఇండియా. ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న ఏ రాష్ట్రం వారికైనా కల్యాణ లక్ష్మీ అమలు చేస్తున్నాం.1.5కోట్లతో బొల్లారంలో కల్యాణ మంటపం నిర్మిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేసి.. 12000రూపాయలతో పాటు.. 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం.కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలతో కార్మికులకు కనీసం పని దొరకక ఇబ్బందులు పడ్డారు. trs ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటంతో కార్మికులకు అదనంగా పని దొరకుతోంది. కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు వ్యాపార వేత్తలు వస్తున్నారు. త్వరలో సంగారెడ్డి, పటాన్ చెరువు లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించి.. ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తాం.కంటి వెలుగు పథకం ద్వారా వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కంటి పరీక్షలు చేసి.. ఉచితంగా అద్దాలు ఇస్తాం. అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తాం. కాళేశ్వరం ద్వారా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో సాగు నీరు ఇచ్చి.. ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని దూరం చేస్తాం. నెల రోజుల్లో బొల్లారం పురపాలక సంఘంగా మారుతుంది. పురపాలిక శాఖ నుంచి 20కోట్ల స్టార్ట్ అప్ నిధులు ఇప్పిస్తాం. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. రోడ్ల మీద చెత్త వేయొద్దని,చెట్లను పెంచాలని స్థానికులకు మంత్రి సూచించారు.