దుష్ట శక్తులకు సుప్రీం తీర్పు చెంపపెట్టు.- మంత్రి హరీశ్.

న్యూఢిల్లీ:
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని చూస్తున్న దుష్ట శక్తులకు సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు.సోమవారం ఢిల్లీ, తెలంగాణ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ప్రతిపక్షాలు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చేస్తున్న కుట్రలు ఇకనైనా ఆపాలని మంత్రి హరీష్ రావు కోరారు. హైకోర్టులో 80, సుప్రీంకోర్టు లో 3 , నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 3 కేసులు వేశారని, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలనే ఉదేశ్యం తప్ప మరి ఎం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 10 అనుమతులు అన్ని వచ్చాయని ఈరోజు కేవలం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో కేవలం పని ఆపాలని మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సూదిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు అది కూడా కోర్టు కొట్టేసిందని, కాళేశ్వరం పై మూడు సార్లు సుప్రీంకోర్టులో కేసు వేశారనీ ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్లను 2012 లో ప్రారంభించారనీ 8 ఏళ్ళైనా ఒక్క అనుమతి కూడా కాంగ్రెస్ సాధించలేదనీ ఎద్దేవా చేశారు. ప్రజల భూములు పోతాయి అని ఊళ్ళు మునిగిపోతాయి అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తు కుట్రలు పన్నుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్లకు 5300 కోట్లు ఖర్చు పెట్టారని, మొబలైజేషన్ పేరుతో కోట్లు దండుకున్నారనీ విమర్శించారు. కుట్రలు చేస్తూ ప్రాజెక్టుల పై కేసులు వేస్తున్నారనీ,
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడితే వన్యప్రాణుల నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారనీ మంత్రి హరీష్ రావు తెలిపారు. చనిపోయిన వారి పేర్లు మీద కూడా ప్రాజెక్టు ల పై కేసులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదనీ దుయ్యబట్టారు. కాళేశ్వరానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కీలకమైన అన్ని అనుమతులు ఇచ్చిందనీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 8 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పని కేవలం నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు నీరు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపాలని చంద్రబాబు నాయుడు రోజుకో లేఖ కేంద్రానికి రాస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.అంతకుముందు మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి నితిన్ గడేకారి ని ఆయన కార్యాలయంలో కలిశారు. నీటీ పారుదల ప్రాజెక్ట్ లకు సహకారం, జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలన్న అంశాలపై కేంద్ర మంత్రి తో చర్చించామనీ మంత్రి హరీష్ రావు తెలిపారు. భీమా, నీల్వాయి, ర్యాలి వాగు, మత్తడి వాగు, కొమరం భీం ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందనీ, మూడు నెలల కాలానికి దాదాపు 50-60 కోట్లు రావాల్సి ఉందన్నారు. నిధుల విడుదల చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులను ఆదేశించారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపులో రాష్ట్రం నుంచి 7 జాతీయ రహదారులను కేటాయించాలని కోరామనీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
సిద్దిపేట-ఎల్కతుర్తి,
జనగామా-దుద్దెడ,
మెదక్-ఎల్లారెడగడి,
పకీరా బాద్-బైంసా,
సిరిసిల్ల-కామారెడ్డి,
వలిగొండ-తొర్రురూ,
నిర్మల్-ఖానాపూర్ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరగా, తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారనీ మంత్రి హరీష్ రావు చెప్పారు.
CADWM ఇన్సెంటివైజేషన్ స్కీంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసినట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. AIBP కింద తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు విడుదల చేయాల్సిన బకాయిలను వెంటనే‌ విడుదల‌ చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు తో పాటు పార్లమెంటు సభ్యులు బి. వినోద్, కొత్త ప్రభాకర రెడ్డి, శాసనసభ్యుడు చింతా ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్. వేణుగోపాల చారి లు పాల్గొన్నారు.