దేశానికి ‘మిషన్ భగీరథ’ మోడల్! – ఎర్రబెల్లి దయాకరరావు:


Hyderabad:

“ప్రతి ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరం.
తెలంగాణలో ఇప్పటికే మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నాం.మిషన్ భగీరథను అన్ని రాష్ట్రాల అధికారులు పర్యావేక్షించి అభినందించిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించాం.వేసవికాలంలో కూడా తాగు నీటి కొరత లేకుండా చేయగలిగాం.ఈ ప్రాజెక్టు ఖర్చులో సగం ఖర్చును కేంద్రం ఆర్ధిక సాయం రూపంలో అందించాలని కోరుతున్నాం.
ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చు చేయడంతో అప్పు ఏర్పడింది. అందుకోసం కేంద్రం సహకారం అందించాలి.కనీసం కేంద్రం ఈ పథకం నిర్వహణ ఖర్చునైనా భరించాలి” అని తెలంగాణ మంత్రి దయాకర్ రావు అన్నారు.కేంద్ర జల శక్తి శాఖ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ నిర్వహణపై న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సదస్సు.కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అధ్యక్షతన సదస్సు. హాజరైన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్.