ధర్మపురి కాంగ్రెస్ లో వర్గపోరు.

– రేసులో రవీందర్ ముందంజ.
– రవి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సానుకూలం.!

కరీంనగర్:

ధర్మపురి టిక్కెట్ కోసం ఆశిస్తున్న నాయకులలో మద్దెల రవి ముందంజలో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం పార్టీ పరిశీలనలో ఉన్నది.
టిక్కెట్ కోసం నువ్వా , నేనా అన్న రీతిలో ప్రయత్నాలు సాగుతున్నవి.ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రాజుకుందిఇప్పటికే గ్రామాల్లో ప్రచారం తామే అభ్యర్థి అన్న స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. కొంత మంది నాయకుల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కోల్డ్ వార్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులకు నిరసనగా చేసిన ధర్నాలో పరస్పరం దుషించుకునే పరిస్థితి నెలకొంది.తెలంగాణ అసెంబ్లీ రద్దు, ఆధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో తామే అధికారంలో రావాలని అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాలను చేస్తున్నవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు కొనసాగుతోంది. ధర్మపురి టిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఇక్కడి నుండి ఇద్దరు నువ్వా నేనా అన్న రీతిలో టిక్కెట్ కోసం పోటి పడుతున్నారు. అందులో ఒకరు కాంగ్రెస్ నుండి మూడుసార్లు పోటి చేసి ఓటమి పాలైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మరొకరు టిడిపి నుండి కాంగ్రెస్ లో చేరిన మద్దెల రవీందర్ ఉన్నారు. ఆ ఇద్దరు నాయకులు ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ నాకే టిక్కెట్ వస్తోందని ప్రచారం చేస్తున్నారు.తాను స్థానికుడినని, ఎప్పటికి ప్రజల్లో ఉంటానని, ప్రజలు తనకే మద్దుతును ఇస్తారని మద్దెల రవి చెప్తున్నారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టు మారింది.రేవంత్ రెడ్డి ఇంటి పై ఐటి దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని, మంచిర్యాల – కరీంనగర్ రహదారి పై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో కొంత మంది కార్యకర్తలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మరి కొందరు
మద్దెల రవీందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ధర్నా రసా భాస గా మారింది. కార్యకర్తలు ఒకరినొకరు దుషించుకొని, తోపులాడుకునే స్థాయికి చేరింది.దీంతో రెండు వర్గాల మధ్య పోరుకు తెర లేచింది.