నకిలీ విలేకరుల అరెస్ట్:

ఖమ్మం:

బెదిరింపులతో అక్రమ వసూళ్ళలకు పాల్పడుతున్న విలేకర్ల ను టాస్క్ ఫోర్స్ , ఖమ్మం ఆర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విలేకరుల ముసుగులో డబ్బులు వసూళ్లు చేస్తున్న సభ్యులను అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ మరియు అర్బన్ పోలీసులు. సత్తుపల్లి దగ్గర గంగారం గ్రామంలో బియ్యం లారీని పట్టుకుని మేము విలేఖర్లమంటూ లారీ యజమానిని రెండు లక్షల రూపాయలను ఇవ్వాలంటూ లారీ డ్రైవర్ ను ఆధీనంలో వుంచుకొని ఫోన్ ద్వారా ఓనర్ను బలవంతం చేయగాడబ్బు తీసుకునేందుకు ఖమ్మం రాగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు అర్బన్ పోలీసులు కలిసి వలపన్ని పట్టుకున్నారు. పట్టుకున్న వారిలో తోట కిరణ్ మనం దినపత్రిక , వి.సురేష్ కుమార్ నమస్తే తెలంగాణ విలేకరి, విలేకరి v6 న్యూస్ ఫజల్ తో పాటు మరో ముగ్గురు పరారిలో వున్నారు . రోడ్డు మీద వెళుతున్న లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు వీరిపై నిఘా పెట్టి ఖమ్మం ఆర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ శ్రీ సర్కిల్ సమీపంలో అదుపులోకి తీసుకోవటం జరిగింది . పట్టుబడ్డ ఇద్దరు కాకుండా మిగిలిన నాలుగురి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.