నకీలీ బంగారం అమ్మే ముఠా అరెస్టు.

వరంగల్:
మార్కెట్‌ ధరకన్నా తగ్గువ ధరకు మేలిమి బంగారం అమ్ముతామని మోసాలను పాల్పడుతున్న ఆరుగురు  ముఠా సభ్యుల్లో ఐదుగురిని సోమవారం సి.సి.ఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు, ఈ గ్యాంగ్‌ సభ్యుల నుండి 6లక్షల రూపాయల నగదుతో పాటు ఒక కత్తి, బంగారాన్ని పోలివున్న నకీలీ బంగారు పూసల దండలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ తెలిపారు.
పోలీసులు అరెస్టు చేసిన గ్యాంగు సభ్యుల వివరాలు:

1. రతన్‌లాల్‌ హరిలాల్‌ సోలంకీ, తండ్రి పేరు హరిలాల్‌, వయస్సు 46, నివాసం చింతల్‌వడ్ఫీ, రాంటేక్‌, నాగ్‌పూర్‌ జిల్లా, మహరాష్ట్ర.

2. బీర్‌ చంద్‌ హరి సోలంకి, తండ్రి హరిలాల్‌, వయస్సు 36, నివాసం మాన్సర్‌,రాంటేక్‌, నాగ్‌పూర్‌ జిల్లా, మహరాష్ట్ర

3. రాజు సోలంకి తండ్రి పేరు బాబులాల్‌,వయస్సు 20,నివాసం న్యూ ఆమెత్‌నగర్‌,రాంటేక్‌, నాగ్‌పూర్‌ జిల్లా, మహరాష్ట్ర.

4. మిక్కు ననవ పర్మర్‌, తండ్రిపేరు నన్ను పర్మర్‌, వయస్సు20, నివాసం పూర్ణ, పర్బన్‌జిల్లా, మహరాష్ట్ర.

5. బబ్లూ జీవన్‌ సోలంకి, తండ్రిపేరు జీవన్‌, వయస్సు 21,మాన్సర్‌,రాంటేక్‌, నాగ్‌పూర్‌ జిల్లా, మహరాష్ట్ర.

6. గుల్షన్‌ సోలంకి,( ప్రస్తుతం పరారీలో వున్నాడు ) తండ్రి పేరు బాబులాల్‌, వయస్సు25,న్యూ ఆమెత్‌నగర్‌,రాంటేక్‌, నాగ్‌పూర్‌ జిల్లా, మహరాష్ట్ర.పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పాటు అందరు దగ్గర బంధువులు. నిందితులందరు మహరాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ తయారు చేసి అమ్ముకునేవారు. దీని ద్వారా వచ్చే అదాయంతో త్రాగుడుతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డారు. దీనితో నిందితులు జల్సా చేసేందుకు తాము చేసే పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులందరు ఒక ముఠా ఏర్పడి. బంగారు రంగుతో పోలివున్న పూసలను చూపించి మార్కెట్‌ ధరకన్నా తక్కువ ధరకు మేలిమి బంగారు అమ్ముతామని చేప్పి ప్రజలకు నకిలీ బంగారంను అమ్మి డబ్బు సంపాదించాలనే ప్రణాళికను రూపోందించుకున్నారు. ఈ ముఠా సభ్యులు ముందుగా బంగారు రంగుతో పోలివున్న పూసనలను మార్కెట్‌లో కోనుగోలు చేయడంతో పాటు కోద్ది మొత్తంలో అసలు బంగారంను కోనుగోలు చేసారు. నిందితులు తమ ప్రణాళికలో భాగంగా ముందుగా బంగారు నగరల వ్యాపారులు లేదా సంపన్నుల వద్ద వెళ్ళి కోనుగోలు చేసిన అసలు బంగారం పూసలు వారికి చూపించి తమకి మీషన్‌ భగీరథ త్రవ్వకాల్లో దోరికినట్లుగా నమ్మించి వీటిని తమ అవసర నిమిత్తం అతి తక్కువ ధర అందజేస్తామని సదరు వ్యాపారస్తులను నమ్మించి బేరం కుదుర్చుకునేవారు. నిందితులు బంగారం అందజేసేందుకు మరో రోజు గడువు పెట్టడంతో వ్యాపారస్తులు డబ్బుతో సిద్దంగా వుండాలని చెప్పి తిరిగి పోయేవారు. నిందితులు తెలిపిన రోజున సదరు భాధితులకు ఫోన్‌ చేసి తాము చెప్పినట్లుగానే బంగారు గోలుసులు తీసువచ్చామని తెలిపి భాదితుల వద్దకు పోయి వారినుండి డబ్బులు తీసుకోని నకిలీబంగారు పూసలు అందజేసేవారు. ఒక వేళ భాదితులు పూసలగోలుసులను నకిలీబంగారంగా గుర్తించి ముఠా సభ్యులను ప్రశ్నిస్తే సదరు ముఠా సభ్యులు భాదితులను కత్తితో పోడిచి చంపుతామని బెదిరించి అక్కడినుండి పారిపోయేవారు. ఇదే తరహలో నిందితులు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నాలుగు నేరాల్లో 25లక్షల రూపాయలను దోచుకున్నారు.

ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత మే నెల 4వ తారీఖున ఈ ముఠా సభ్యులు ఏనమాముల మార్కేట్‌ ప్రాంతంలోని నగల వ్యాపారికి నకిలీ బంగారు పూసల నగలు అంద జేసీ 5 లక్షల దోచుకోవడంతో పాటు సదరు వ్యాపారిని చంపుతామని కత్తితో బెదిరించి పారిపోయారు. గత ఆగస్టు మాసం 3వ తేదిన మట్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జకోటియా కాంప్లేక్స్‌లోని రెడీమెడ్‌ బట్టల వ్యాపారి వద్ద 5లక్షలు,ఆగస్టు 6వతేదిన సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని ఎన్‌.జి.ఓ కాలనీలోని బంగా నగల వ్యాపారి నుండి 10లక్షలు,ఆగస్టు 25వ తేదిన హన్మకోండ ప్రాంతంలో వెండి వస్తువులు తయారిదారుడి నుండి 5లక్షల రూపాయలను దోచుకున్నారు. సదరు బాధితలు ఫిర్యాదులో అప్రమత్తమయిన సి.సి.ఎస్‌ పోలీసులు ప్రస్తుతం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులో వున్న సైబర్‌క్రైం విభాగం సహకారంతో నిందితుల కదిలికలపైనిఘా కోనసాగించారు. ఇందులో భాగంగా నిందితులు ఈ సంవత్సరం ఏప్రిల్‌ మాసం నుండి ఇప్పటి మోసాలకు పాల్పడినారు. ఈ క్రమంలో నిందితులు మరోమారు వ్యాపారులను మోసం చేసేందుకుగాను ఈ రోజు వరంగల్‌ నగరంలో పిన్నావారి వీధిలో వున్నట్లుగా క్రైమ్స్‌ అదనపు డి.సి.పి బిల్లా అశోక్‌కుమార్‌కు పక్కాసమాచారం అందడంతో ఆప్రమత్తమయిన సి.సి.ఎస్‌ పోలీసులు అదనపు డి.సి.పి అదేశాల మేరకు సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాస్‌ తన సిబ్బందితో కల్సివెళ్ళి పిన్నవారివీధిలో అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన మోసాలను పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు అసలు బంగారం పేరుతో నకిలీ బంగారు గోలుసులు అందజేసి దోచుకున్న 25 లక్షల రూపాయల నుండి తమ వ్యక్తిగత అవసరాలగాను 19లక్షల రూపాలను ఖర్చు చేయడంతో పాటు మిగిలిన 6లక్షల రూపాయల తమ వద్దనే వున్నట్లుగా అంగీకరించారు.
నిందితులను గుర్తించి సకాలంలో అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్‌ అదనపు డి.సి.పి బిల్లా అశోక్‌కుమార్‌, క్రైం ఏ.సి.పి బాబురావు, సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్‌2 శ్రీనివాస్‌, సైబర్‌క్రైమ్స్‌ విభాగం ఇన్స్‌స్పెక్టర్‌ డి. విశ్వేశ్వర్‌,ఏ.ఏ.ఓ ప్రశాంత్‌, సుబేదారి ఎస్‌.ఐ నవీన్‌, సి.సి.ఎస్‌ హెస్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసరాజు, రవికుమార్‌, జంపయ్య మరియు కానిస్టేబుళ్ళు మహమ్మద్‌ ఆలీ (మున్నా), సైబర్‌క్రైమ్‌ కానిస్టేబుల్‌ కిషోర్‌, సిటిగార్డ్స్‌ కానిస్టేబుల్లు మహేష్‌, కరుణాకర్‌లను వరంగల& పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ అభినందించారు.