నగ్ననృత్యం తో ట్రంప్ పై న్యాయపోరాటం.

వాషింగ్టన్;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో రాసలీలలు ఆడారని బాంబు పేల్చిన శృంగార తార స్టెఫానీ క్లిఫోర్డ్ అలియాస్ స్మార్టీ డేనియల్స్ మరో సంచలనం సృష్టించింది. అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి కూతవేటు దూరంలోనే నగ్నంగా నాట్యం చేసింది. క్లోక్ రూమ్ అనే స్ట్రిప్ క్లబ్ ప్రారంభించిన స్మార్టీ డేనియల్స్.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దుస్తులు, ఆభరణాలన్నీ ఒలిచేసి ఒంటిపై నూలుపోగు లేకుండా నృత్యం చేసింది. తలకు 50 డాలర్లకు తక్కువ కాకుండా టికెట్ ధర నిర్ణయించగా మొత్తం 11 వేల డాలర్లు కేవలం టికెట్ల రూపంలో వసూలయ్యాయి. ఇవి కాకుండా ఆమెపై వెదజల్లిన డబ్బు కూడా ఆమెకే ఇవ్వనున్నట్టు క్లబ్ యజమాని తెలిపాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్ చేశారని స్టార్మీ డేనియల్స్ ఆరోపించింది. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని బెదిరించారని చెప్పింది. 2016 ఎన్నికలకు ముందు ట్రంప్‌తో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించిందని ట్రంప్ న్యాయవాదులు ఆమెపై 2 కోట్ల డాలర్ల పరువు నష్టం దావా వేశారు. అయితే ఆ దావా చెల్లదని స్టార్మీ చెబుతోంది. ట్రంప్, ఆయన మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకెల్ కోహెన్ పై కోర్టులో కేసు వేసింది. కోర్టు ఖర్చుల కోసం ఆమె ఇలా నగ్నంగా డాన్స్ చేసింది.