“నయీం పైసలు కూడా కేసిఆర్ తినేసిండు”.-వి.హెచ్.

షాద్ నగర్:

తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ మీద కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. షాద్ నగర్ ఎంకౌంటర్లో హతమార్చిన నరహంతక గ్యాంగ్ స్టర్ నయీం పైసలు కేసిఆర్ కుటుంబం తినేసిందని ఆరోపించారు. నయీం పైసల లెక్క చెప్పాలని నేను ఇన్ కం ట్యాక్స్ వాళ్లకు కాయితం ఇస్తే మాకు తెల్వదని అంటున్నరని విహెచ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు పోవాలనే దానిపై కసరత్తు చేశారు విహెచ్. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు స్థానాలు బిసిలకు కేటాయించాలని తాము ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. తన నాయకత్వంలో స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఇంకా అనేక కీలక విషయాలపై చర్చ జరిగిందన్నారు. కుటుంబానికి ఒకే సీటు ఇవ్వాలన్న చర్చ కూడా జరిగిందన్నారు. కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరగొద్దన్నదే తమ వాదన అని చెప్పారు.