‘నరక కూపం’లో ఉన్నారని……

యాదాద్రి భువనగిరి:
తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులంతా క్యూ కట్టడం హృదయ విదారకంగా ఉన్నది. వ్యభిచార కొంప నుంచి బయటపడిన చిన్నారులు ఎవరయి ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారో ఓ వైపు పోలీసులు విచారణ జరుపుతుంటే, పేపర్ లో, టీవీలో చూసి తమ పిల్లల ఉన్నారని ఆశతో ‘గుట్ట’ పీఎస్ కి తల్లిదండ్రులు వచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన తల్లిదండ్రులు మౌనిక అనే పాప తమ బిడ్డని ఆధారాలతో వచ్చారు. మరొకరు మల్కాజిగిరి ecil నుంచి వచ్చిన తల్లిదండ్రులు(కృష్ణా అనురాధ) ఇందు లో తమ కూతురు 4 సంవత్సరాల క్రితం తప్పిపోయిందని వచ్చారు. అయితే ప్రస్తుతం చిన్నారులు ఆమన్ గల్ లోని ఉజ్వల హోం లో ఉండటంతో dna టెస్ట్ లు చేయించి ఎవరి పిల్లల్లో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఇటీవల కాలంలో మిస్సింగ్ అయిన పిల్లల తల్లిదండ్రులు అంతా తమ పిల్లలు గుట్ట లో ఉన్నారనే ఆశతో యాదాద్రి కి తరలివస్తున్నారు.