నల్లగొండ చీడ పురుగులు జగదీశ్, కూసుకుంట్ల. – టీఆరెస్ బహిష్కృత నేత వేనేపల్లి.

రవి,నల్లగొండ:
ఉమ్మడి నల్లగొండలో మంత్రి జగదీశ్, మునుగోడు మాజీ శాసన సభ్యుడు ప్రభాకర్ రెడ్డి వైఖరి వల్ల మునుగోడు నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా బ్రష్టుపట్టిపోయిందని టిఆర్ఎస్తి రుగుబాటు నాయకుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చి తనను పార్టీ నుండి సస్పెండ్ చేయించారని నల్లగొండలో జరిగిన సమావేశంలో వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, నాయకులకు కార్యకర్తలకు విభేదాలను జిల్లా మంత్రిగా పరిష్కరించేందుకు జగదీశ్ రెడ్డి ప్రయత్నం చేయలేదని చేయలేదని అన్నారు. అవినీతిపరులను ప్రోత్సహిస్తూ పార్టీని మొత్తం బ్రష్టు పట్టించారని ఆరోపించాడు. కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను కాడుకునేందుకు గొంతు ఎత్తడం జరిగిందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో జిల్లా మంత్రి, మునుగోడు మాజీ శాసనసభ్యుడు పూర్తిగా వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మరోసారి కెసిఆర్ నాయకత్వం అవసరమని చెప్పారు.

పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం ఇద్దరు వ్యక్తుల వ్యవహారం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పూర్తిగా బ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ చెట్టుకు రెండు పురుగులు పట్టాయని ఆ పురుగులను తొలగించాలని తన ఆవేదన, ఆందోళన అని ప్రకటించారు. నాలుగున్నరేళ్ల కాలంలో మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పారు.ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల నేడు ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. అధిష్టానం ఇప్పటికైనా మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటో క్షేత్ర సాయి పరిశీలనకు రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టిని కాపాడుకునే తాపత్రయంలో కార్యకర్తలకు అండగా నిలవాలని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలని కోరారు.