నల్లగొండ బరిలో టీఆర్ఎస్ రెబెల్ గా చకిలం అనిల్.

నల్లగొండ:
దివంగత నేత చకిలం శ్రీనివాస రావు తనయుడు అనిల్ నల్లగొండ నుంచి అసెంబ్లీకి టీఆరెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చకిలం శ్రీనివాస్ రావు
ఒక మారు లోక్సభకు, మూడు మార్లు శాసనసభ కు ప్రాతినిధ్యం వహించారు.చనిపోయేంత వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పని చేశారు. ఆయన కుమారుడు అనిల్ 2001 లో టి ఆర్ యస్ లో చేరారు.2014 వరకు నల్గొండ శాసనసభ నియోజకవర్గ టి ఆర్ యస్ పార్టీ ఇంచార్జిగా పని చేశారు. 2004 లో కాంగ్రెస్ పొత్తులో బాగంగా, 2009 లో మహా కూటమిలో బాగంగా టిక్కెట్ గల్లంతు అయ్యింది 2014 లో చివరినిమిషం లో సీటు గల్లంతు చేశారు.ఇక ఈ సారి రెబెల్ గా బరిలోకి దిగేందుకు ఆయన నిర్ణయం తీసికున్నారు.