నాగం భద్రత పునరుద్ధరణ.

హైదరాబాద్:
నాగం జనార్ధన్ రెడ్డి కి హైకోర్టు లో ఊరట లభించింది. నాగం కు భద్రత పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనకు గన్ మెన్ లను తొలగించడం పై నాగం హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేషించింది. విచారణను సోమవారం కు వాయిదా వేసిన హైకోర్టు.