నాగార్జున హరితహారం.

హైదరాబాద్:
తెలంగాణకు హరితహారంలో భాగంగా “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాజ్యసభ సభ్యుడు సంతోష్ మూడు మొక్కలు నాటి అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. సంతోష్ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను నాగార్జున స్వీకరించి.. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం మూడు మొక్కలు నాటారు. నాగార్జున మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కరణ్ జోహర్, సమంత, నటుడు ధనుష్‌కు గ్రీన్ ఛాలెంజ్ చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.