నాటుపడవ బోల్తా: కొనసాగుతున్న గాలింపు చర్యలు.

తూ.గో:
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద ప్రయాణికులతో నిండిన ఇంజన్‌ పడవ శనివారం గోదావరిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఆరుగురు విద్యార్థులు, ఒక మహిళ ఉన్నారు. నదిలో గల్లంతయిన వారి గాలింపు కోసం అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. బాగా చీకటిపడటంతో, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అర్ధరాత్రి దాటాకా గాలింపు చర్యలు నిలిపివేశారు. దీంతో ఆదివారం ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, నేవీ, రెస్క్యూ బృందాలను రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంక వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను నాటుపడవ ఢీకొని బోల్తా పడినవిషయం తెలిసిందే.
గల్లంతైనవారు: కొండేపూడి రమ్య, పోలిశెట్టి సుచిత్ర, మనీషా, సుంకర శ్రీజ, గెల్లా నాగమణి, తిరుకోటి ప్రియ, జ్ఞానకుమారి, జానకీరామయ్య, పోలిశెట్టి అనూష.