నిజంగా ‘విషమ’ పరీక్ష!!

కరీంనగర్:
పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి.. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఓ విచిత్ర పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ హిందీ పరీక్షకు  మొత్తం ఏడుగురు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. కానీ ఒకే ఒక విద్యార్థి పరీక్షకు వచ్చాడు.. హాజరయైన ఒక విద్యార్థి కోసం ఈ సెంటర్‌లో ఉదయం 9.30 గంటల నుండి 12.45 వరకు హిందీ పరీక్షను నిర్వహించారు. లెక్కప్రకారం ఏడుగురు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్ అనే విద్యార్థి ఒక్కడే హాజరయి రాయగా ఒక్కడి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారి, క్లర్క్, ఇన్విజిలేటర్, ఓ అటెండర్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి(ఏఎన్‌ఎం), ఇద్దరు కానిస్టేబుళ్లు సహా మొత్తం ఎనిమిది మంది డ్యూటీకి హాజరయ్యారు… వీరే గాక ఫ్లయింగ్ స్వాడ్ రూపంలో మరో నలుగురు అధికారులు కరీంనగర్ నుండి రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పోలీస్ బందోబస్తుతో వచ్చారు.
పరీక్ష రాసిన విద్యార్థి  ఒకడే అయినా అతని కోసం దాదాపు 15 మంది దాక విదులు నిర్వహించడం జనం కొత్తగా చూశారు… జర్మనీ దేశంలో ఒక విద్యార్థి కోసం ఏకంగా రైలు నడుస్తుండగా మన దగ్గర ఒక విద్యార్థి కోసం 15 మంది పని చేయడం గొప్పేమికాదులే అని  ముక్తాయించారు..